ట్యాంక్ బండ్ పై ధర్మభిక్షం విగ్రహం పెట్టాలి:పందుల యాదగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గురువారం కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం( Dharmabhiksham ) జయంతి వేడుకలను గీత పనివారాల సంఘం యాదాద్రి జిల్లా కార్యదర్శి పందుల యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మభిక్షం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడని,నిరంతరం పేద ప్రజల హక్కుల కోసం పాటుపడిన నిస్వార్థ కమ్యునిస్టు,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనికొనియాడారు.ట్యాంకు బండ్( Tank bund ) పై ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గీతా పనివారల సంఘం అధ్యక్షుడు నీళ్ల గాలయ్య, కంఠమహేశ్వర స్వామి దేవాలయం అధ్యక్షుడు రాపర్తి కరుణాకర్, మొగుదల సత్తయ్య, పాలకుర్ల యాదయ్య, వీరమల్ల యాదయ్య,నీళ్ల యాదయ్య,లింగస్వామి, ముత్యాలు,యాదయ్య, స్వామి,చంద్రయ్య, ఐటిపాముల అంజయ్య, పల్లె రాములు,రాములు, రాజు,రఘు తదితరులు పాల్గొన్నారు.

Roulette Lightning : A Revolution In A Classic Game — RNG ...
Advertisement

Latest Video Uploads News