పూజా విధానంలో దర్భల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాలలో చేసేటటువంటి ఎటువంటి కార్యక్రమానికైనా దర్భలు తప్పనిసరిగా వాడుతారు.

అంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ దర్భలను యాగాలు, హోమాలు, దేవతా ప్రతిష్టలకు, పిండ ప్రదానం చేసేటప్పుడు ఈ దర్భ లను వాడుతూ ఉంటారు.

ఈ దర్భలను వాడడానికి గల కారణం ఏమిటి? వాడటం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.ఈ దర్భల నే కొందరు గరిక అని కూడా పిలుస్తూ ఉంటారు.

ఇది ఒక రకమైన గడ్డి జాతికి చెందిన మొక్క దాదాపు రెండు అడుగుల పొడవు ఉంటుంది. ఈ దర్భలు శ్రీరాముని స్పర్శకు నోచుకోని అంత పవిత్రమైనవిగా ఆ దర్భలను ప్రతి పూజా కార్యక్రమానికి వాడుతున్నారు.

ఈ దర్భలకు అధిక ఉష్ణ శక్తిని కలిగి ఉంటుంది.ఈ దర్భలను నీటిలో వేయడం వల్ల ఆ నీటిని శుభ్రపరుస్తుంది.గ్రహణ సమయాలలో ఈ దర్భలను ప్రతి ఒక్క ఆహారపదార్థాలలో వేయడం గమనించే ఉంటాం.

Advertisement

అలా వేయడం వల్ల సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల ప్రభావం ఆహార పదార్థాలపై పడకుండా ఈ దర్బలు ఉపయోగపడతాయి.హోమం, యాగం, దేవతారాధన చేసేటప్పుడు ఈ దర్భలను ఉంగరం గా చేసే మన కుడి చేతి ఉంగరపు వేలికి తొడుగుతారు.

ఆ వేలికి కఫనాడీఉండడంవల్ల, ఈ ఉంగరం ధారణ వల్ల కఫం శుభ్రపడుతుంది.ఏదైనా శుభకార్యం నిర్వహించేటప్పుడు రెండు దర్భలతో చేసిన ఉంగరాన్ని తొడుగుతారు.

పితృకార్యాలు చేసేటప్పుడు మూడు దర్బలు, దేవ కార్యాలలో నాలుగు దర్బలు, గల ఉంగరాన్ని ముడివేస్తారు.ఇంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ దర్బలలో దర్భ అడుగుభాగాన సాక్షాత్తు ఆ బ్రహ్మ కొలువై ఉంటాడని, మధ్యభాగంలో విష్ణుమూర్తి, దర్భ శిఖరాన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువై ఉంటారని ప్రతితీ.

అమావాస్య రోజు కోసిన దర్భలను ఒక నెల పాటు ఉపయోగించవచ్చు.పౌర్ణమి సమయంలో కోసిన దర్భలను పదిహేను రోజులపాటు, ఆదివారం రోజున కోసిన దర్భలను ఒక వారం పాటు ఉపయోగించవచ్చు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఈ దర్భలను ప్రథమ పూజ్యుడైన ఆ వినాయకుడి కి ఎంతో ప్రీతికరమైనది.దేవుని యందు ఈ దర్భలను సమర్పించి పూజించడం వల్ల మనం చేసే ప్రతి కార్యం కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుందని వేద పండితులు చెబుతుంటారు.

Advertisement

తాజా వార్తలు