యుగానికి ఒక్కడు సీక్వెల్... కార్తీ స్థానంలో ధనుష్

విభిన్న కథాంశాలు ఎంచుకొని సినిమాలు చేయడంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు సెల్వ రాఘవన్.

7/జి బృందావన్ కాలనీ, ఆడువారి మాటలకి అర్ధాలు వేరులే, యుగానికి ఒక్కడు లాంటి సినిమాలు అతని పేరు చెబితే గుర్తుకొస్తాయి.

ప్రతి సినిమా వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి.అనుష్కతో వర్ణ అనే సినిమాలో కూడా చాలా విభిన్నమైన కాన్సెప్ట్ ని సెల్వ రాఘవన్ పరిచయం చేశాడు.

అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.ఇదిలా ఉంటే సెల్వ కెరియర్ లో అద్భుతమైన చిత్రంగా యుగానికి ఒక్కడు సినిమా కనిపిస్తుంది.

కార్తీ పెర్ఫార్మెన్స్ కి ఈ సినిమా ఒక కలికితురాయి.మామూలు కథాంశం తీసుకొని దానిని చోళుల కాలం నాటి కథకి లింక్ చేసి చెప్పిన సెల్వ రాఘవన్ అందులో విజువల్ ప్రెజెంటేషన్ కూడా అద్భుతంగా ఆవిష్కరించాడు.

Advertisement
Dhanush Teams Up With Selvaraghavan For Aayirathil Oruvan 2, Tollywood, Kollywoo

ఒక ఆ సినిమా సమయంలోనే క్లైమాక్స్ లో సీక్వెల్ ఉంటుందనే విధంగా హింట్ ఇచ్చి వదిలాడు.పదేళ్ల తర్వాత ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ని దర్శకులు సిద్ధం చేస్తున్నాడు.

Dhanush Teams Up With Selvaraghavan For Aayirathil Oruvan 2, Tollywood, Kollywoo

దీనికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుంది.ఈ ఏడాదిలోనే పట్టాలు ఎక్కించబోతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో కార్తీ పోషించిన పాత్ర కోసం ఈ సారి అతని ప్లేస్ లో సెల్వ తమ్ముడు స్టార్ హీరో ధనుష్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి మరో మూడేళ్లు దర్శకుడు తీసుకుంటున్నాడు.2024లో యుగానికి ఒక్కడు సీక్వెల్ వస్తుందని చెప్పాడు.ప్రస్తుతం ధనుష్, సెల్వ రాఘవన్ కలయికలో ఒక సినిమా తెరకెక్కుతుంది.

పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.ఏది ఏమైనా పదేళ్ల క్రితం మొదటి సినిమాకే సెల్వ రాఘవన్ భారీగా ఖర్చు పెట్టాడు.

ఈ సారి దాని బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు