'సార్' రిలీజ్ డేట్ ఫిక్స్.. బాలయ్య డేట్ లో రావడానికి ధనుష్ సిద్ధం!

విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాందించుకున్నాడు ధనుష్.

జాతీయ నటుడిగా అవార్డు అందుకుని హాలీవుడ్ ఆఫర్స్ కూడా అందుకుంటూ అక్కడి కూడా సినిమాలు చేస్తున్నాడు.

ధనుష్ నటిస్తున్న సినిమాలన్నీ డబ్బింగ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి.దీంతో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.

ఈయన డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు.ప్రెసెంట్ ధనుష్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాడు.ఈ సినిమా పట్టాలెక్కక ముందే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసాడు.

Advertisement

సార్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

బైలింగ్వన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ధనుష్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

తాజాగా సార్ నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్టు తెలిపారు.

తమిళ్ లో వాతి పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది.అయితే ధనుష్ బాలయ్యకు ఎంతగానో కలిసి వచ్చిన డేట్ రోజే రాబోతున్నాడు.

Advertisement

అఖండ సినిమా గత ఏడాది డిసెంబర్ 2న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.మరి అదే రోజు రాబోతున్న సార్ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.