వరల్డ్ వైడ్ గా కుమ్మేస్తున్న 'ధమాకా'.. 2 రోజుల్లోనే అన్ని కోట్ల వసూళ్లు..

మాస్ రాజా రవితేజ హీరోగా పెళ్ళిసందడి బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ధమాకా.

రెండు డిజాస్టర్స్ తర్వాత మాస్ రాజా ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేయడంలో మేకర్స్ సఫలం అయ్యారు.ఈ సినిమా కోసం రవితేజ రెండు వారాల ముందు నుండే వరుస ప్రొమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమాపై హైప్ పెరిగేలా చేసాడు.

ఇక భారీ అంచనాలతో ధమాకా సినిమా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.19 కోట్ల టార్గెట్ తో రవితేజ బరిలోకి దిగాడు మాస్ రాజా.ధమాకా మొదటి రోజునే సాలిడ్ వసూళ్లు రాబట్టింది.

మాస్ రాజా రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.మంచి ఆక్యుపెన్సీతో దక్కించుకుని ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంది.

Advertisement

ఈ సినిమా ఫస్ట్ షో నుండే మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ కుమ్మేసింది.మొదటి రోజు 10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా సెకండ్ డే కూడా అదే రేంజ్ లో వసూళ్లు రాబట్టింది.వరల్డ్ వైడ్ గా రెండవ రోజు ఈ సినిమా 9 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తుంది.

టోటల్ గా రెండు రోజుల్లోనే 19 కోట్ల గ్రాస్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలిచింది.ఇక ఈ రోజు క్రిస్మస్ కూడా తోడవ్వడంతో ఈ రోజు కూడా కుమ్మేసే కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.

చూడాలి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని రవితేజ సొంతం చేసుకుంటాడో లేదో.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?
Advertisement

తాజా వార్తలు