తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన డిజిపి రాజేంద్రనాధ్..

బ్రహ్మోత్సవాల సమయంలో పోలీసు సిబ్బందికి దిశ నిర్దేశం చేసిన డిజిపి.ఈ నెల 27వ తేదీ నుండి అక్టోబరు 5వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

గరుడ వాహన సేవ సందర్భంగా పటిష్ఠమైన బందోబస్తు చేసాం.దాదాపు 5,500 మంది పోలీసు సిబ్బందితో భధ్రత ఏర్పాటు చేసాం.4,400 మంది సివిల్ పోలీసులతో, 1100 మంది విజిలెన్స్, సెక్యూరిటీతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.ఏడు మంది అడిషనల్ ఎస్పిలు, ముప్పై ఐదు డిఎస్పిలు, 154 సిఐలు,337 ఎస్సైలను బందోబస్తుకు నియమించాం.

రెండేళ్ళ తరువాత నిర్వహించే స్వామి వారి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉంది.తమిళనాడు, కర్ణాటక నుండి అధిక స్ధాయిలో భక్తులు విచ్చేసే అవకాశం ఉందని అంచనా వేశాం.ప్రతి ఏడాది 2.5 లక్షల మంది భక్తులు విచ్చేస్తే, ఈ ఏడాది గరుడోత్సవానికి 3.5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది.భక్తుల రద్దీకి తగ్గట్టుగా తిరుమలలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం.

అధిక సంఖ్యలో భక్తులు వస్తే నియంత్రించేందుకు తిరుపతిలో పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి అక్కడ ఉంచే విధంగా చర్యలు చేపడుతున్నాం.ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి వాహనాల్లో వచ్చే భక్తులకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసాం.

Advertisement
వైరల్: అరటిపండును ఇలా ఎపుడైనా తిన్నారా? అమ్మబాబోయ్!

తాజా వార్తలు