ఢిల్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి దేవినేని ఉమ సీరియస్ కౌంటర్ లు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సన్నాహక సదస్సులో పాల్గొన్న సీఎం జగన్.

పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.ఆ ప్రసంగంలో విశాఖపట్నం రాజధాని అని త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు వ్యాఖ్యానించారు.

దీంతో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ సీరియస్ కౌంటర్ లు ఇచ్చారు.సీఎం జగన్ అభద్రతా భావంతో ఉన్నారని అన్నారు.

వివేక హత్య కేసులో కుట్ర దారులను సిబిఐ వెలుగులోకి తీసుకువస్తుందని.ఈ క్రమంలో దీన్ని దృష్టి మరల్చడానికి విశాఖ వ్యవహారం జగన్ తెరపైకి తెచ్చారని ఆరోపించారు.కేసు విచారణలో ఉండగా సీఎం జగన్ ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు.

Advertisement

ఇదే సమయంలో జగన్ పై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని అన్నారు.అంతేకాదు ఢిల్లీలో బాబాయ్ హత్య కేసులో ముద్దాయిలను కాపాడేందుకు జగన్ పైరవీలు చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపణలు చేయడం జరిగింది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు