సినిమా ఒప్పుకునేందుకు ముందు దేవిశ్రీప్రసాద్ వింత షరతు.. ఏంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ కంపోజర్లలో దేవి శ్రీ ప్రసాద్( Devi Shri Prasad ) ముందు వరుసలో నిలుస్తాడు.

సంగీత బాణీలు సమకూర్చడం మాత్రమే కాదు చాలా బాగా పాటలు కూడా పాడతాడు.

చంద్రుడిలో ఉండే కుందేలు, కానీ ఇప్పుడు, జగదేకవీరుడికి అతిలోకసుందరికి, యు అండ్ ఐ లాంటి ఎన్నో పాటలను దేవిశ్రీప్రసాద్ అద్భుతంగా పాడి అలరించాడు.పాటలకు లిరిక్స్ కూడా అందిస్తాడు.

DSP 21 ఏళ్ల కాలంలో 100కు పైగా సినిమాలకు మ్యూజిక్ ఆఫర్ చేశాడు.ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఖడ్గం, మన్మధుడు, వర్షం, వెంకీ, బన్నీ, పౌర్ణమి, బొమ్మరిల్లు వంటి ఎన్నో క్లాసికల్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు.

దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం వల్లే చాలా సినిమాలు హిట్ అయ్యాయంటే అతిశయోక్తి కాదు.డీఎస్పీ కొట్టిన సంగీతం వింటే చెవిలోని దుమ్ము వదిలి పోవాల్సిందే.అంత బాగా అతను సంగీతం కంపోజ్ చేస్తాడు.

Advertisement

టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో చాలా సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.ఆయన సంగీతం సమకూర్చిన "గబ్బర్ సింగ్" పాటలు( "Gabbar Singh" Songs ) ఏ లెవెల్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మిర్చి, అత్తారింటికి దారేది, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలకు కూడా ఇతనే సంగీత దర్శకుడు.2001 నుంచి ఇప్పటిదాకా కూడా మోస్ట్ బిజియస్ట్‌ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా దేవి శ్రీ ప్రసాద్ నిలుస్తున్నాడు.ప్రస్తుతం అతని చేతిలో పుష్ప 2, కంగువా, తండేల్‌, ఉస్తాద్ భగత్ సింగ్, కుబేర వంటి సినిమాలకు సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నాడు.

పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) తర్వాత దేవి శ్రీ ప్రసాద్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందని చెప్పుకోవచ్చు.అయితే ఈ నేపథ్యంలోనే అతనికి సంబంధించి ఒక ఆశ్చర్యపరిచే రూమర్ చెక్కర్లు కొడుతోంది.ఆ రూమర్ ప్రకారం దేవి శ్రీ ప్రసాద్ తాను ఏ సినిమాకి అయితే సంగీత దర్శకుడిగా ఒప్పుకుంటాడో ఆ సినిమాలో తనకి పాట పాడే అవకాశం ఇవ్వాలని ఒక షరతు పెడతాడట.

అందుకే చాలామంది దర్శకులు భయపడతారని అంటారు.ఏదేమైనా త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీను వైట్ల, సుకుమార్ వంటి టాప్ డైరెక్టర్ల సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించే వాటి విజయాలకు ఓ కారణమయ్యారు దేవిశ్రీ.

ఈ ఆర్టిస్ట్ చాలా పాటలు రాయడమే కాకుండా హీరోలకి కూడా డబ్బింగ్ చెప్పాడు.

ఈ స్టార్ డైరెక్టర్లు ఇప్పటికైన మారాల్సిన అవసరం ఉందా..?
Advertisement

తాజా వార్తలు