దేవీ నవరాత్రులు.. దుర్గాదేవి తొమ్మిది అవతారాలు ఇవే..!

దసరా నవరాత్రులు మొదలవడంతో ఎంతోమంది భక్తులకు పండగ వాతావరణం నెలకొంటుంది.

ఈ నవరాత్రులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తూ, ఎంతో ఉత్సాహంగా ఈ నవరాత్రులను జరుపుకుంటారు.

నవరాత్రుల లో భాగంగా ఒక్కోరోజు ఒక్కో అవతారంలో ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ భక్తులకు దర్శనం ఇస్తుంటారు.అయితే ఏరోజు ఏ అవతారంలో భక్తులకు దర్శనం కల్పిస్తారో, అలాగే ఏ రోజున ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Devi Navaratri, Speciality Of Festival, Durgadevi Nine Types, Hindu Festivals-�

నవరాత్రుల లో భాగంగా శుక్రవారం నుంచే అమ్మవారి వేడుకలు ప్రారంభమయ్యాయి.నవరాత్రులలో మొదటిరోజు అమ్మవారు భక్తులకు శైలపుత్రి అనే అవతారంలో దర్శనం కల్పించారు.

శైలపుత్రి అవతారం లో ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో తామరపువ్వు పట్టుకొని నంది వాహనం పై అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తారు.మొదటి రోజులో భాగంగా అమ్మవారికి నెయ్యిని సమర్పించడం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆ తల్లి కరుణించి కాపాడుతుందని, భక్తులు విశ్వసిస్తారు.

Advertisement

రెండవ రోజు భక్తులకు అమ్మవారు బ్రహ్మచారిని దేవత అవతారంలో దర్శన భాగ్యం కల్పిస్తారు.ఈ దేవతకు చక్కెర ను నైవేద్యంగా సమర్పించడం ద్వారా దీర్ఘాయువును సమర్పిస్తుంది.

మూడవరోజు చంద్రఘంట దేవత అవతారంలో కనిపిస్తారు.ఈ దేవత నుదుటిపై నెలవంక చంద్రుని ఆకారంలో తిలకం పెట్టడం వల్ల ఆ పేరు వచ్చింది.

ఈ దేవతకు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా నొప్పులతో బాధపడే వారికి ఆ సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది.నవరాత్రుల లో భాగంగా నాలుగవ రోజున అమ్మవారు కుష్మాండ అవతారమెత్తి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.

ఐదవ రోజు అమ్మవారిని స్కంద మాత అవతారం లో భక్తులు విశిష్ట పూజలు నిర్వహిస్తారు.ఈ దేవతకు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

అర‌గంట‌లో పాదాల‌ను తెల్ల‌గా మార్చే ప‌వ‌ర్ ఫుల్ రెమెడీ ఇదే!

నవరాత్రుల్లో ఆరవరోజు శక్తి స్వరూపిణి అయిన కాత్యాయని దేవి అవతారం లో అమ్మవారిని పూజిస్తారు.ఈ దేవతకు భక్తులు తేనెను నైవేద్యంగా సమర్పిస్తారు.

Advertisement

నవరాత్రులలో ఏడవ రోజు అమ్మవారు కాళరాత్రి  అవతారంలో భక్తులకు దర్శనం కల్పిస్తారు.పురాణాల ప్రకారం రాక్షస సంహారం చేయడానికి రంగును త్యాగం చేసి చీకటిని స్వీకరించడం ద్వారా అమ్మవారికి కాళరాత్రి అని పేరు వచ్చింది.

ఈ అమ్మవారి అనుగ్రహం కోసం నల్లటి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి.ఎనిమిదవ రోజు అమ్మవారు మహాగౌరి అవతారంలో గజ వాహనంపై దర్శనం కల్పిస్తారు.

అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించడం ద్వారా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది.నవరాత్రులలో చివరి రోజు అయిన తొమ్మిదవ రోజు అమ్మవారు సిద్ధిదాత్రి అనే దేవత అవతారంలో దర్శనం కల్పిస్తారు ఈ చివరి రోజు అమ్మవారికి నువ్వులను నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో, కటిక ఉపవాసం తోతొమ్మిది రాత్రులు అమ్మవారిని పూజించడం ద్వారా ఆమె అనుగ్రహం కలిగి అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

తాజా వార్తలు