Tirumala Tirupati Devasthanam : శ్రీవారి బ్రేక్ దర్శన సమయాలలో మార్పులు చేసిన దేవస్థానం..

తిరుమల తిరుపతి దేవస్థానం మన దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం.

ఈ ఆలయానికి ప్రతిరోజు మన దేశ లోని అనేక రాష్ట్రాల నుంచి ఎన్నో లక్షల మంది ప్రజలు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు.

అలాగే మరి కొంతమంది వ్యక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.ఇలా శ్రీవారి దర్శనానికి వచ్చిన మరి కొంతమంది శ్రీవారికి తల వెంట్రుకలను మొక్కుగా సమర్పిస్తూ ఉంటారు.

శ్రీవారి దర్శనం చేసుకోవడానికి రావాలనుకున్నవారు శ్రీవారి దర్శనాలలో చేసిన మార్పులను తెలుసుకొని రావడం ఎంతో ముఖ్యం.తిరుమల శ్రీవారి దేవాలయంలో డిసెంబర్ 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం ఎనిమిది గంటలకు మారుస్తున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.

అయితే ఈ విధంగా స్వామి వారి దర్శన సమయాలను ప్రయోగాత్మకంగా మారుస్తున్నట్లు కూడా వెల్లడించారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

Advertisement

ఈ కారణంగా అయినా భక్తులు ఏ రోజుకు ఆరోజే తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే వీలు ఉండే అవకాశం ఉంది.దీనివల్ల తిరుపతిలో గదులపై ఒత్తిడి తగ్గే వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

అంతేకాకుండా నవంబర్ 30న మాధవంలో శ్రీవాణి ట్రస్టు దాతలకు కౌంటర్ ప్రారంభించనున్నారు.శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవ విశ్రాంతి గృహంలో బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ మొదలు పెడుతున్నారు.ఇప్పటి నుంచి శ్రీ వాణి ట్రస్టు దాతలకు ఇక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కూడా ఇచ్చే వీలుంటుంది.

వీరికి గదులు కూడా ఇక్కడే మంజూరు చేస్తారని దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్29, ఆదివారం 2024
Advertisement

తాజా వార్తలు