పవర్ స్టార్ తో సినిమా చేసే పనిలో ఉన్న దేవకట్టా...

సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు వాళ్లు తీసే సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు.

ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయితే వరుసగా వాళ్ళకి పది సినిమాల ఆఫర్లు వస్తాయి.

అలా కాకుండా ఒక సినిమా ఫ్లాప్ అయితే అవకాశం ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు.అందుకే కెరియర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా ఉండటానికి అందరూ డైరెక్టర్లు( Directors ) చాలా మంచి సినిమాలు చేస్తూ ఉంటారు.

అలా ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ లు దక్కకుండా ఉన్న డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం.

సినిమా ఇండస్ట్రీలో మంచి స్టోరీ తో మన ముందుకు వచ్చి మనందరిని అలరించిన డైరెక్టర్లలో దేవకట్టా( Devakatta ) ఒకరు.ఈయన తీసిన సినిమాలు ఇప్పటికి కూడా చాలా ఫ్రెష్ గా చూసినంత సేపు చాలా ఎంగ్జింగ్ గా బాగుంటాయి దాని వల్ల ఆ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఆయన చేసిన ప్రస్థానం సినిమా( Prasthanam movie ) కూడా చాలా మంది విమర్శకుల నుంచి కూడా ప్రశంసలను అందుకుంది.

Advertisement

ఈ సినిమాతో మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందిన దేవకట్టా ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ ఆయన పెద్దగా సక్సెస్ లు కొట్టింది అయితే లేదు.ఇక తను చివరగా తీసిన రిపబ్లిక్ సినిమా( Republic movie ) కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాట్లాడిన మాటలు చాలా వరకు వైరల్ గా మారాయి దానివల్ల ఈ సినిమా మీద కొంతవరకు నెగిటివ్ అభిప్రాయం వచ్చిందని అందుకే ఈ సినిమా అంతగా ఆడలేదని చాలామంది చెప్తూ ఉంటారు.

అయితే ఈ సినిమా ఎలా ఉన్నా కూడా ఆయన తన తదుపరి చిత్రంగా పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద హీరోని పెట్టుకుని ఒక పెద్ద సబ్జెక్టుతో మన ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు