‘దేవదాస్‌’ కలెక్షన్స్‌ మొదటి రోజు పరిస్థితి ఏంటీ?

నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్‌’ విడుదలైంది.

భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రానికి భారీగా పబ్లిసిటీ చేయడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను అంటూ దర్శకుడు శ్రీరామ్‌ ఆధిత్య చెప్పుకొచ్చాడు.అయితే సినిమా మాత్రం యావరేజ్‌ టాక్‌ వచ్చిందని చెప్పక తప్పట్లేదు.

ఇద్దరు హీరోలు ఉన్న కారణంగా సినిమా కలర్‌ ఫుల్‌గా ఉంది తప్ప, సినిమాలో మ్యాటర్‌ పెద్దగా లేదు అంటూ కొందరు విశ్లేషకులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన దక్కింది.

సహజంగా పెద్ద హీరో సినిమా అంటే మంచి అంచనాలుండటంతో పాటు, భారీ ఓపెనింగ్స్‌ దక్కుతాయి.ఇక ఇద్దరు హీరోలు ఉంటే ఆ సినిమా ఓపెనింగ్స్‌ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.నాగార్జున మరియు నానిలు తమ స్టామినాను నిరూపించుకున్నాడు.

Advertisement

సినిమా టాక్‌తో సంబంధం లేకుండా మొదటి రోజు సగానికి పైగా షోలు హౌస్‌ఫుల్‌ అయినట్లుగా ట్రేడ్‌ వర్గాల నుండి రిపోర్ట్‌ అందుతుంది.సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో ఎలా ఉందో మనమూ చూద్దాం అన్నట్లుగా ఎక్కువ శాతం జనాలు సినిమాకు క్యూ కట్టారు.

కౌశల్‌ ఆర్మీ నానిపై కోపంతో ఈ సినిమాకు బ్యాడ్‌ పబ్లిసిటీ చేస్తామంటూ హెచ్చరించిన విషయం తెల్సిందే.అయితే ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు.సినిమాకు యావరేజ్‌ టాక్‌ దక్కిన కారణంగా మొదటి రోజు నాలుగు షోలు కూడా బాగానే ఆడాయి.

ఇక ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది.సునాయాసంగా మిలియన్‌ మార్క్‌ను చేరుతుందని అంతా భావిస్తున్నారు.ఇక నేటి నుండి సినిమాకు అసలు పరీక్ష మొదలు అవుతుంది.

నేడు శుక్రవారం అవ్వడంతో కలెక్షన్స్‌ ఎలా ఉంటాయో చూడాలి.తెలంగాణలో నేడు బంద్‌ అంటున్న కారణంగా ఒక మోస్తరుగా కలెక్షన్స్‌ నమోదు అవ్వడం ఖాయం.

మీ జ్ఞాపకశక్తి తగ్గినట్టు అనిపిస్తుందా.. అయితే వెంటనే ఇలా చేయండి!

ఇక శని, ఆదివారాల్లో ఈ చిత్రం కుమ్మెయనుందని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.మొత్తంగా ఈ చిత్రం సేఫ్‌ జోన్‌లో పడుతుందనే నమ్మకం సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు