అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన డిప్యూటీ సీఎం చిన్న కుమారుడు.. స్పందించిన మాజీ సీఎం

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

పవన్‌ కళ్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో (Pawan Kalyan, Mark Shankar)జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలపాలయ్యాడు.

ఈ ఘటన శుక్రవారం సింగపూర్‌లోని(Singapore ) ఓ స్కూల్‌లో జరిగింది.అగ్నిప్రమాదం తీవ్రతతో స్కూల్‌లో పెద్దఎత్తున పొగలు, మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.అలాగే మంటలతో ఏర్పడిన పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో మార్క్ శంకర్‌కు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి.

వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.అయితే, ప్రస్తుతానికి మార్క్ శంకర్‌ సింగపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నాడు.

Advertisement

ప్రమాద స్థితి వివరాలు పూర్తిగా వెలుగులోకి రాకపోయినా, మానసికంగా కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైనట్లు సమాచారం.ఇకపోతే, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లాలో పర్యటనలో ఉన్నారు.

ఇప్పటికే అరకు సమీపంలోని కురిడి గ్రామానికి వెళ్లి అక్కడి గిరిజనులతో మాట్లాడాలని నిన్న మాట ఇచ్చినట్టు పవన్ తెలిపారు.ఆ గ్రామ పర్యటనను పూర్తి చేసి, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం విశాఖపట్నం (Visakhapatnam)చేరుకుంటానని తెలిపారు.

అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ ఘటనపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan)స్పందించారు.ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.ఈ ఘటన షాక్ కి గురి చేసిందని, ఈ సందేశంతో కుటుంబానికి సానుభూతి తెలుపుతూ, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

న్యూస్ రౌండర్ టాప్ 20

పవన్‌ కళ్యాణ్‌ చిన్న కుమారుడికి ఈ ప్రమాదం కుటుంబాన్ని కలవరపెట్టింది.అయితే ప్రస్తుతానికి మార్క్ శంకర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతోందని సమాచారం.రాష్ట్ర రాజకీయ వర్గం, అభిమానులు కూడా సోషల్ మీడియాలో అతని ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు