సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భంలో నిరాశ,నిస్పృహలకు గురి కావాల్సిందే.అయితే నిరాశకు గురి కావటానికి ఒక్కో మనిషికి ఒక్కో కారణం ఉంటుంది.
అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు డిప్రెషన్ కి గురి అవుతారు.అయితే ఏ రాశుల వారు డిప్రెషన్ కి లోను అవుతారో ఒక్క సారి చూద్దాం.
మకర రాశి ఈ రాశివారికి ఇతరుల కన్నా తామే ముందు ఉండాలనే తాపత్రయం చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ రాశి వారు ఒక్కోసారి ఎంత కష్టపడినా వారు అనుకున్నది సాధించటంలో విఫలం అవుతూ ఉంటారు.
వీరు సామర్ధ్యానికి మించి పనిచేసిన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటంతో సఫలం కారు.ఈ కారణాలతో మకర రాశి వారు డిప్రెషన్ కి లోను అవుతూ ఉంటారు.
వృషభ రాశి ఈ రాశి వారు వాస్తవాన్ని గ్రహించి జీవితాన్ని గడపాలి.వీరు ఊహల్లో బ్రతికితే ఇబ్బందులు తప్పవు.
కలల్లో విహరిస్తూ ఉండటం వలన వాస్తవంలో అలా జరగకపోయేసరికి ఇబ్బందులకు గురవుతారు.దాంతో చాలా సులభంగా వృషభరాశి వారు డిప్రెషన్ లోకి వెళ్తారు.
వృశ్చిక రాశి ఈ రాశి వారు ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచిస్తారు.ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారిలోనే బాధ పడతారు.
దాంతో డిప్రెషన్ కి లోను అవుతారు.మీన రాశి ఈ రాశివారు ప్రతి చిన్న విషయానికి తొందరగా బాదలోకి వెళ్ళిపోతారు.
అయితే వారికి తాము ఎందుకు బాధపడుతున్నామో కూడా తొందరగా అర్ధం కాదు.వీరి సున్నితమైన మనస్తత్వం కారణంగా తొందరగా డిప్రెషన్ కి లోను అవుతూ ఉంటారు.
కర్కాటక రాశి వీరు ఎక్కువగా నెగిటివ్ గా ఆలోచించటం వలన పిరికితనంతో ఉంటారు.అలాగే వీరు తమ గురించి ఎదుటి వారు ఏమి అనుకుంటున్నారో అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.
వీరికి భావోద్వేగాలు కూడా ఎక్కువే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy