డెల్ బ్రాండ్( Dell ) గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ల్యాప్‌టాప్ కొనాలని అనుకున్నవారికి ముందుగా గుర్తొచ్చే బ్రాండ్ డెల్.
ఈ విషయంలో ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచింది.ప్రజల అవసరాలకు తగ్గట్టు మంచి స్పెసిఫికేషన్లతో కొత్త కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తూ ఉంటుంది.
ఈ క్రమంలోనే డెల్ టెక్నాలజీస్ తాజాగా ఇండియన్ మార్కెట్లో సరికొత్త కమర్షియల్ పోర్ట్‌ఫోలియోను పరిచయం చేయడం గమనార్హం.
ఈ నేపథ్యంలో వరుసగా ఈ కంపెనీ ఆప్టిప్లెక్స్ ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్, ప్రెసిషన్ మొబైల్ వర్క్‌స్టేషన్స్ (MWS), లాటిట్యూడ్ నోట్‌బుక్స్, 34 అంగుళాల అల్ట్రాషార్ప్ కర్వ్డ్ మానిటర్‌ను లాంచ్ చేయడం విశేషం.వివిధ సంస్థల డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీని వేగవంతం చేయడానికి ఈ ప్రొడక్ట్స్ సహాయపడతాయని డెల్ కంపెనీ యాజమాన్యం పేర్కొంది.అప్‌గ్రేడెడ్ డెల్ ఆప్టిమైజర్ ఫీచర్స్, 13వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్స్‌తో ఇవి బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తాయని పేర్కొంది.డెల్ ఆప్టిప్లెక్స్ 7410 AIO డెస్క్‌టాప్( OptiPlex 7410 AIO ) ధర రూ.64,500 కాగా 34-అంగుళాల అల్ట్రాషార్ప్ కర్వ్డ్ WQHD మానిటర్ రూ.56వేలకు అందుబాటులో వుంది.
అలాగే ప్రెసిషన్ మొబైల్ వర్క్‌స్టేషన్స్ ల్యాప్‌టాప్ సిరీస్ ధరలు రూ.76వేల నుంచి వున్నాయి.అదేవిధంగా లాటిట్యూడ్ నోట్‌బుక్స్ ల్యాప్‌టాప్ సిరీస్ ధరలు రూ.59,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి.ఎక్స్‌పాండెడ్ డెల్ ఆప్టిమైజర్ ఫీచర్‌తో వచ్చే ఈ ప్రొడక్ట్స్.
మంచి పనితీరు కనబరుస్తాయని కంపెనీ వెల్లడించింది.లాటిట్యూడ్ నోట్‌బుక్స్( Latitude Notebooks ) సిరీస్‌లో కంపెనీ లాటిట్యూడ్ 9440 2-in-1 మోడల్‌ను పరిచయం చేయడం విశేషం.
ఈ ల్యాప్‌టాప్ ప్రపంచంలోనే అతి చిన్న 14-అంగుళాల కమర్షియల్ పిసిగా గుర్తింపు పొందింది.ఈ స్పెసిఫికేషన్‌తో ఎగ్జిక్యూటివ్స్, కన్సల్టెంట్స్, సేల్స్ పర్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.
కాబట్టి వినియోగదారులు వీటిగురించి మరింత సమాచారాన్ని డెల్ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి చూడగలరు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy