ఆరోగ్యాన్ని పెంచే రుచికరమైన లడ్డూ ఇది.. రోజుకి ఒకటి తిన్నా బోలెడు లాభాలు!

ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలంటే జీవన విధానాన్ని మార్చుకోవాలి.ముఖ్యంగా పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

అటువంటి ఫుడ్స్ లో ఇప్పుడు చెప్పబోయే లడ్డూ( laddu ) కూడా ఒకటి.ఆరోగ్యాన్ని పెంచే ఈ రుచికరమైన లడ్డూను రోజుకి ఒకటి తిన్నా చాలు బోలెడు లాభాలు పొందవచ్చు.

మరి ఇంతకీ ఆ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలి.? అది అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక కప్పు రోల్డ్ ఓట్స్( Rolled oats ) ను వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు వాల్ నట్స్ వేసి వేయించుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న ఓట్స్ మరియు వాల్ నట్స్( Wall nuts ) వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత అందులో ఒక కప్పు గింజ తొలగించిన ఖర్జూరం( date palm ) వేసి అన్నీ కలిసేలా మెత్తగా మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరి చుట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ ఓట్స్ వాల్ నట్ లడ్డూలు చాలా రుచికరంగా ఉంటాయి.మరియు అనేక పోషకాలను కలిగి ఉంటాయి.

రోజుకు ఒకటి చొప్పున ఈ లడ్డూలను తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.ముఖ్యంగా వెయిట్ లాస్ అవుతారు.

పొట్ట వద్ద కొవ్వు కరుగుతుంది.అతి ఆకలి దూరం అవుతుంది.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

అలాగే ఈ లడ్డూల్లో విటమిన్ కె మరియు కాలుష్యం పుష్కలంగా ఉంటుంది.అందువల్ల వీటిని తీసుకుంటే ఎముకలు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి.

Advertisement

జ్ఞాపక శక్తిని, ఆలోచన శక్తిని పెంచే సామర్ధ్యం ఈ లడ్డూకు ఉంది.అంతేకాదు రోజుకు ఒకటి చొప్పున ఈ లడ్డూలను తింటే దంపతుల్లో సంతాన సమస్యలు నయం అవుతాయి.

గుండె ఆరోగ్యంగా మారుతుంది.మైగ్రేన్ సమస్యతో బాధపడే వారికి కూడా ఈ లడ్డూ ఎంతో మేలు చేస్తుంది.

రోజు ఈ లడ్డూను తింటే మైగ్రేన్ అటాక్స్ తగ్గుతాయి.మరియు రాత్రుళ్లు నిద్ర కూడా చాలా బాగా పడుతుంది.

తాజా వార్తలు