రేవంత్‌కు ఫుల్ స‌పోర్టు ఇస్తున్న ఢిల్లీ అధిష్టానం.. అందుకేనా ఈ వార్నింగ్‌లు..?

రేవంత్‌రెడ్డిని టీ-పీసీసీ చీఫ్ గా చేసిన‌ప్ప‌టినుంచి చాలామంది వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు.

ఇప్పటికీ కోమ‌టిరెడ్డి లాంటి వారు ఆయ‌న‌తో క‌లిసేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోయినా కొంద‌రు ఏదో బ‌ల‌వంతంగా అయినా క‌లిసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇలా బ‌లవంతంగా క‌లిసిన వారిలో ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి కూడా ఒక‌రు అయితే ఆయ‌న మొద‌టి నుంచి రేవంత్ మీద విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు.అయితే ఆయ‌న్ను వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన త‌ర్వాత కొంచెం సైలెంట్ గానే క‌నిపించారు.

రేవంత్ పెట్టే ప్ర‌తి మీటింగ్ కు కూడా హాజ‌ర‌వుతున్నారు.ఇక ఆయ‌న సైలెంట్ అయిపోయారనుకున్న నేప‌థ్యంలోనే ఆయ‌న మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు.

దీంతో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగిపోయిన‌ట్టు తెలుస్తోంది.ప్ర‌తిసారి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో పార్టీలో మ‌ళ్లీ అస‌మ్మ‌తి చెల‌రేగే ప్ర‌మాదం ఉంటుంద‌ని జగ్గారెడ్డిపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది.

Advertisement
Delhi Supremacy Giving Full Support To Revanth Is That Why These Warnings , Rev

ఇక‌పై ఎవ‌రు ఇలాంటి కామెంట్లు చేసినా ఊరుకునేది లేద‌ని క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాలంటూ సూచించిన‌ట్టు తెలుస్తోంది.రేవంత్‌ను ఎవ‌రు కామెంట్లు చేసినా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఢిల్లీ అధిష్టానం గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

Delhi Supremacy Giving Full Support To Revanth Is That Why These Warnings , Rev

ఇక అధిష్టానం వార్నింగ్‌తో జగ్గారెడ్డి ఓ మెట్టు దిగివ‌చ్చి మ‌రీ సారీ చెప్పి ముగింపు పలికారు.జ‌గ్గారెడ్డి కామెంట్ల మీద ఏఐసీసీ ప్రతినిధులు ఆయ‌న్ను గాంధీ భవన్ కు పిలిపించారంట‌.అక్క‌డే వివ‌ర‌ణ‌లు తీసుకుని వివాదాన్ని ప‌రిష్క‌రించార‌ని తెలుస్తోంది.

ఇక‌పై ఎవ‌రు ఇలాంటి కామెంట్లు చేసినా కూడా వారిని ఇలాగే పిలిపించి మాట్లాడుతామ‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం.ఇక జ‌గ్గారెడ్డి వ్య‌వ‌హారంలో జ‌రిగిన దానితో మిగ‌తా వారంతా కూడా సైలెంట్ అయిపోయిన‌ట్టు తెలుస్తోంది.

మొత్తానికి రేవంత్‌రెడ్డికి అధిష్టానం ఫుల్ స‌పోర్టుగా ఉంటున్న‌ట్టు తెలుస్తోంది.ఇక‌పై ఎవ‌రు ఇలాంటి వ్య‌తిరేక గ‌ళం వినిపించినా ఇప్పుడు చేస్తున్న స‌భ‌లు, న‌రిస‌న‌లు వేస్ట్ అవుతాయ‌ని భావిస్తోందంట ఢిల్లీ అధిష్టానం.

నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు