ఢిల్లీ లిక్కర్ స్కాం.. మరోసారి విచారణకు ఎమ్మెల్సీ కవిత

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇవాళ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది.

వరుసగా రెండో రోజు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.నిన్న సుమారు 11 గంటల పాటు కవితను అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై వాంగ్మూలాల ఆధారంగా కవితను విచారించారు.అదేవిధంగా పిళ్లై, అమిత్ అరోరా, సిసోడియాతో కలిపి కవితను ప్రశ్నించినట్లు సమాచారం.

అయితే ఇవాళ ఈడీ విచారణకు వెళ్లేముందు కవిత మీడియాతో మాట్లాడనున్నారు.

Advertisement
గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం

తాజా వార్తలు