బతికున్నానని తెలియడానికి ఆ పని చేస్తున్నా.. దీప్తి సునైనా షాకింగ్ కామెంట్స్?

దీప్తి సునైనా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఈమె తన పరిచయాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పెంచుకుంది.

డబ్స్మాష్ వీడియోల ద్వారా అందరి దృష్టిలో పడిన ఈమె మొత్తానికి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సెలబ్రిటీ హోదాకు చేరుకుంది.అంతేకాకుండా రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని మరింత పరిచయం పెంచుకుంది.

కేవలం డబ్స్మాచ్ వీడియోలతోనే కాకుండా యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంది.కవర్ సాంగ్స్ కూడా చేస్తుంది.

ఇక ఈమె వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ తో కొంతకాలం ప్రేమాయణం నడపగా ఆ తర్వాత షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్నప్పుడు ఆయన ప్రవర్తన నచ్చకపోవడంతో వెంటనే అతనికి బ్రేకప్ చెప్పేసింది.

Advertisement
Deepthi Sunaina Shocking Reply To Netizen Question,Deepthi Sunaina,Shanmukh Jasw

ఇక సోషల్ మీడియాలో మాత్రం దీప్తి సునైనా ఎప్పుడు యాక్టివ్ గా కనిపిస్తుంది.షణ్ముఖ్ తో బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతుంది.

చాలా వరకు సోషల్ మీడియా ద్వారా తన బ్రేకప్ మూడ్ నుండి బయటపడింది.ఇక ఈమధ్య మరింత స్లిమ్ గా మారటానికి బాగా వర్క్ అవుట్ లు చేస్తూ కనిపిస్తుంది.

ఖాళీ సమయం దొరుకుతే చాలు తన ఫ్రెండ్స్ తో కూడా బాగా సందడి చేస్తూ కనిపిస్తుంది.వాళ్లతో ట్రిప్స్ తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది.

ప్రస్తుతం ఆమె ఓ షార్ట్ ఫిలిమ్ లో నటించగా అది విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక ఇటీవలే ఈమె సొంతంగా ఓ ఇల్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంది.తన గృహప్రవేశ వేడుకకు చాలామందిని ఆహ్వానించి వారితో బాగా సందడి చేసింది.

Deepthi Sunaina Shocking Reply To Netizen Question,deepthi Sunaina,shanmukh Jasw
Advertisement

అయితే దీప్తి ఎంత బిజీ లైఫ్ లో ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.ముఖ్యంగా తన ఫోటో మాత్రం ఖచ్చితంగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా బాగా ముచ్చట్లు పెడుతుంది.

వాళ్ళు అడిగే ప్రశ్నలకు బాగా సమాధానాలు చెబుతూ ఉంటుంది.అప్పుడప్పుడు షన్నుని ఉద్దేశించి కూడా కొన్ని కామెంట్లు చేస్తూ ఉంటుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పింది.అయితే ఓ నెటిజన్ మాత్రం స్టోరీలో రోజుకు ఒక ఫోటో అయినా పెడతారు ఎందుకు అని అడిగారు.

దాంతో దీప్తి.బ్రతికి ఉన్నానని తెలియటానికి పెడతాను అని సమాధానం ఇచ్చింది.

దాంతో ఆమె కామెంట్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.నిజానికి అప్పుడప్పుడు దీప్తి కౌంటర్లు వేసే విధంగా సమాధానం ఇస్తూ ఉంటుంది.

తాజా వార్తలు