కరణ్ జోహార్ పార్టీ సాక్షిగా బాలీవుడ్ మరోసారి కలకలం!

సినిమా, డ్రగ్స్ ఈ రెండు ఎప్పుడు చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉంటుంది.

సినిమా ప్రపంచంలో విపరీతంగా వచ్చి పడే డబ్బు, అంతకు మించి స్టేటస్ సెలబ్రిటీలని తప్పులు మీద తప్పులు చేయిస్తుంది.

అలాగే ఫాస్ట్ నైట్ కల్చర్ కి అలవాటు పడిన సెలబ్రిటీలు డ్రగ్స్, గర్ల్స్ అనేవాటికి బాగా అలవాటు పడతారు.ఇప్పటికే చాలా సార్లు బాలీవుడ్ కి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు బయట పడ్డాయి.

చాలా మంది సెలబ్రిటీలకి డ్రగ్స్ అలవాటు ఉంది అని బయట పడింది.ఇప్పటికి చాలా మంది తమ రోజు వారి లైఫ్ లో డ్రగ్స్ తీసుకోకుండా కొంత మంది ఉండలేరు.

ఇప్పుడు మరో సారి బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది.బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు క‌ర‌ణ్ జొహార్ ఇటీవల సెలబ్రిటీ మిత్రులకు పార్టీ ఏర్పాటు చేసాడు.

Advertisement

ఈ పార్టీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, అందులో సెలబ్రిటీలు అందరూ మత్తులో ఊగుతూ డాన్స్ లతో సందడి చేసారు.ఈ పార్టీలో దీపికా ప‌దుకొనే, ర‌ణ‌బీర్ క‌పూర్, షాహిద్ క‌పూర్, వ‌రుణ్ ధావ‌న్, న‌టాషా ద‌లాల్, మీర్జా రాజ్‌ పుత్‌, మ‌లైకా అరోరా, అర్జున్ క‌పూర్ త‌దిత‌రులు హాజ‌రై సందడి చేశారు.

అదే వీడియోను మరోసారి పోస్ట్ చేసిన ఎస్ఏడీ (శిరోమణి అకాలీదళ్‌) ఎమ్మెల్యే మజీందర్‌ సింగ్‌ సిర్సా సెలబ్రిటీలంతా డ్రగ్స్‌ తీసుకుంటారని ఆరోపించారు.వీరంతా డ్రగ్స్ తీసుకుని, ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారని విమర్శించారు.

దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ కావడం, డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ లో మరోసారి కలకలం రేపింది.

తాజా వార్తలు