హిందూపురం వైసీపీ సమన్వయకర్తగా దీపిక నియామకంపై చర్చ..!!

అనంతపురం జిల్లా హిందూపురం అధికార పార్టీ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.హిందూపురం వైసీపీ సమన్వయకర్తగా దీపిక నియామకం అయ్యారు.

ఈ మేరకు పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.ఎమ్మెల్సీ ఇక్బాల్ కు చెక్ పెడుతూ దీపికకు హిందూపురం బాధ్యతలు అప్పగించడంపై జిల్లా రాజకీయాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

అయితే దీపిక నియామకం నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెర వెనుక ఉండి చక్రం తిప్పారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.అయితే హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు మహిళా అభ్యర్థులు ఎవరూ పోటీ చేయలేదు.

మరోవైపు టీడీపీకి హిందూపురం నియోజకవర్గం కంచుకోట.పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇక్కడ టీడీపీ ఓటమి చెందలేదంటే అర్థం చేసుకోవచ్చు.

Advertisement

ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గానికి బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న విషయం తెలిసిందే.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement