Ration card printing mistake : హతవిధీ.. దత్తా బదులు కుత్తా అని రేషన్‌కార్డులో ప్రింట్.. బాధితుడు కుక్కలాగా అరుస్తూ?

పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో అధికారులు చేసిన ఒక తప్పుకి ఓ వ్యక్తి చాలా బాధ పడిపోతున్నాడు.

ఎందుకంటే అధికారులు రేషన్ కార్డులో తన ఇంటిపేరు దత్తాకు బదులుగా కుత్తా (కుక్క) అని తప్పుగా ప్రింట్ చేశారు.

దాంతో కుక్క అని తన రేషన్ కార్డులో రాసి తనని అవమానించారని అతడు ఫైర్ అవుతున్నాడు.బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎదుట కూడా అతడు గట్టిగట్టిగా అరిచేస్తూ తన గోడును వెల్లబోసుకున్నాడు.

ఇక్కడ జోక్ ఏంటంటే, అతడు తన ఇంటి పేరును కుక్కగా రాశారని వారికి క్లారిటీగా చెప్పేందుకు కుక్కలాగా అరుస్తూ వింతగా ప్రవర్తించాడు.అతడు కుక్కలాగా మొరుగుతూ నిరసన చేసిన దృశ్యాలకు సంబంధించి 45-సెకన్ల వీడియో వైరల్ గా మారింది.

ఇందులో కారులో కూర్చున్న ప్రభుత్వ అధికారికి తన డాక్యుమెంట్స్‌ అందజేసేటప్పుడు ఆ వ్యక్తి కుక్కలాగా గట్టిగా మొరుగుతున్నట్లు చూపిస్తుంది.ఫుల్‌ స్లీవ్‌ షర్ట్‌, ప్యాంట్‌ ధరించిన వ్యక్తి వీడియో అంతటా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ కుక్కలాగా అరిచాడు.

Advertisement

అతను కారు కిటికీ పక్కన నిలబడి, అధికారికి డాక్యుమెంట్స్ చూపిస్తూ కనిపించాడు, ఆ తర్వాత అధికారి వాటిని చూసేందుకు మరొక వ్యక్తికి అందజేశాడు.

ఈ వ్యక్తి పేరు శ్రీకాంతి కుమార్ దత్తా.కాగా అతడి ఇంటి పేరు కుత్తా అని పడింది.తన ఇంటిపేరు మార్చుకోవడానికి అతడు చాలాసార్లు అధికారులను కలిశాడు.

నిజానికి అతడి రేషన్‌కార్డులో ఇప్పటికే రెండు, మూడు సార్లు తప్పులు వచ్చాయి.వాటిని కరెక్ట్ చేసుకోవడానికి అతడు మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపాడు.

"మూడోసారి నా పేరు శ్రీకాంతి దత్తా అని కాకుండా శ్రీకాంతి కుత్తా అని ప్రింట్ అయింది.నా పేరు పదే పదే ఇలా తప్పుగా పడటం వల్ల చాలా ఫీలవుతున్నాను " అని అతను చెప్పాడు.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

శుక్రవారం మళ్లీ కరెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లానని, అక్కడ జాయింట్‌ బీడీఓను చూడగానే ఆయన ముందు కుక్కలా ప్రవర్తించానని చెప్పాడు.ఈ తతంగమంతా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.

Advertisement

తాజా వార్తలు