స్పార్క్ ఆఫ్ దసరా.. ఊర మాస్ లుక్ లో నాని.. ఏంటయ్యా ఈ ట్రాన్స్ఫర్మేషన్..

న్యాచురల్ స్టార్ నాని ప్రసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్ లో మరొక మైలు రాయిలాగా నిలిచి పోయింది.అయితే నాని ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు.

కానీ ఇప్పుడు మాత్రం ఊర మాస్ లుక్ లోకి వచ్చి మాస్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.గత ఏడాది దసరా పండుగ సందర్భంగా నాని కొత్త సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ రోజు సినిమా ప్రకటించడమే కాకుండా ఒక గ్లిమ్స్ కూడా విడుదల అయ్యింది.నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో మరొక విభిన్న పాత్ర పోషించ నున్నట్టు తెలుస్తుంది.

Advertisement

ఇప్పటి వరకు నాని ని చూడని కొత్త లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.ఈయన లుక్ చూసి అప్పుడే ఇది మాస్ ప్రేక్షకులను అలరించే సినిమా అని అంతా అనుకున్నారు.

ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి వేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు.శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు దసరా అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుండి స్పార్క్ ఆఫ్ దసరా పేరుతొ ఒక వీడియోను విడుదల చేసారు.

మండుతున్న ఓపెన్ క్వారీ లో టిప్పర్ లలో బొగ్గు లోడ్ చేస్తున్న విజువల్స్ తో ఈ వీడియో మొదలయ్యి ఆకట్టుకుంది.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??

ఇందులో నాని బ్లాక్ కలర్ గల్ల లుంగీ ధరించి ముందు రెండు 90 ఎం ఎల్ బాటిల్స్ తో ఊర మాస్ లుక్ లో కనిపించిం చేతిలో బీడీ పట్టుకుని మండుతున్న బొగ్గుతో బిడిని అంటించుకుంటూ వీర లెవల్ మాస్ లుక్ లో దర్శనం ఇచ్చాడు.ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.ఇప్పుడు విడుదల చేసిన వీడియోతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు.

Advertisement

ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటిస్తుండగా ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.

తాజా వార్తలు