నాని 'దసరా' బిజినెస్ లెక్కలు.. కెరీర్ లోనే బెస్ట్ గా..

న్యాచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో.

ఆ తర్వాత అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ రెండు సినిమాల్లో శ్యామ్ సింగరాయ్ మంచి హిట్ అవ్వగా.

అంటే సుందరానికి మాత్రం ప్లాప్ అయ్యింది.దీంతో నాని ఫ్యాన్స్ ఈయన నుండి సాలిడ్ హిట్ కోరుకుంటున్నారు.

ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్నాడు.ఈ సాలిడ్ మాస్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

Advertisement

ఈ సినిమాలో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.ఈ సినిమా 2023 మార్చి 30న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేసారు.

ఇక తాజాగా ఈ సినిమా బిజినెస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

ఈ సినిమా నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది అని ఇప్పటికే అందరికి తెలిసిన విషయమే.ఇక ఇప్పుడు బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగినట్టు వార్త షికారు చేస్తుంది.80 కోట్లకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయని.నాని కెరీర్ లోనే ఇవి హైయెస్ట్ రేట్ అని తెలుస్తుంది.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా క్లిక్ అయితే సాలిడ్ వసూళ్లు ఖాయంగా కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు