పెళ్లి పీటలు ఎక్కబోతున్న దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఒదేలా?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్( Sukumar ) ఇండస్ట్రీకి ఎంతోమంది తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇలా సుకుమార్ దగ్గర శిష్యరికం పొందినటువంటి ఎంతోమంది ఇండస్ట్రీలో దర్శకులుగా కొనసాగుతూ ఎంతో మంచి సినిమాలకు దర్శకత్వం వహిస్తూ డైరెక్టర్లుగా పేరు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే సుకుమార్ శిష్యుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల( Sreekanth Odela ).నాచురల్ స్టార్ నాని ( Nani ) కీర్తి సురేష్ ( Keerthy Suresh ) జంటగా నటించిన చిత్రం దసరా( Dasara ).ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకుడిగా పనిచేశారు.ఈ సినిమా ద్వారా దర్శకుడిగా తానేంటో నిరూపించుకోవడమే కాకుండా నాని సినీ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందించిన దర్శకుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు.

ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శ్రీకాంత్ తన తదుపరి ప్రాజెక్టు ఎవరితో చేయబోతున్నారనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.అయితే ప్రస్తుతం ఈయన సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి పుష్ప2( Pushpa 2 ) సినిమా షూటింగ్ లో భాగమయ్యారని తెలుస్తుంది.అయితే తన వృత్తిపరమైన విషయాలు పక్కన పెడితే శ్రీకాంత్ వ్యక్తిగత విషయం గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శ్రీకాంత్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నారన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

శ్రీకాంత్ త్వరలోనే పెళ్లి( Marriage ) చేసుకోబోతున్నారని ఈ క్రమంలోనే ఈయన పుష్ప2 సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ముగియడంతో డైరెక్ట్ గా కరీంనగర్ వెళ్లారని తెలుస్తుంది.అయితే ఈయన వివాహం కరీంనగర్ లోనే జరగబోతుందని సమాచారం.అయితే శ్రీకాంత్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు ఏంటి అనే వివరాలు మాత్రం తెలియడం లేదు కానీ ఈయన మాత్రం చాలా సింపుల్ గా తన వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.

ఇక తన వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారట అలాగే తన గురువుగారు సుకుమార్(Sukumar), బుచ్చిబాబు (Buchibabu) తోపాటు కీర్తి సురేష్, నాని కూడా ఈ పెళ్లికి హాజరు కాబోతున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు