ఇండియాలో స్టార్ట్ అయిన ''దసరా'' బుకింగ్స్.. రెస్పాన్స్ గట్టిగానే ఉందిగా!

న్యాచురల్ స్టార్ నాని హీరోగా మహానటి కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దసరా( Dussehra ).

నాని మొదటిసారిగా పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

నాని ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసిన సినిమా మరో ఎత్తు.ఇది మాస్ కంటే కొద్దిగా ఎక్కువ ఊరమాస్ గా తెరకెక్కింది.

రా అండ్ విలేజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నుండి నాని ఊర మాస్ ఇంటెన్స్ లుక్ అందరిని ఆకట్టు కున్నాయి.ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తెలుగులో మంచి అంచనాలు రేపాయి.

ఈ సినిమా మార్చి 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.కాగా రిలీజ్ కోసం అన్ని పనులను పూర్తి చేస్తున్నారు.

Dasara Bookings Open Now, Dasara, Nani, Keerthy Suresh, Santhosh Narayanan, Srik
Advertisement
Dasara Bookings Open Now, Dasara, Nani, Keerthy Suresh, Santhosh Narayanan, Srik

దీనిపై అంచనాలు బాగా నెలకొనడంతో చిత్ర యూనిట్ మొత్తం సాలిడ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.ఇప్పటికే దసరా సినిమా యూఎస్ లో బుకింగ్స్ స్టార్ట్ అయిన విషయం విదితమే.ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినట్టు మేకర్స్ పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసారు.

దీంతో బుకింగ్స్ కోసం మంచి రెస్పాన్స్ నే లభిస్తుంది.

Dasara Bookings Open Now, Dasara, Nani, Keerthy Suresh, Santhosh Narayanan, Srik

ఇదిలా ఉండగా ఈ సినిమాలో నాని( Nani ) ధరణి పాత్ర పోషించగా.కీర్తి కూడా డీ గ్లామర్ రోల్ లోనే నటించింది.ఇక ఆది పినిశెట్టి కూడా కీలక రోల్ చేస్తున్నాడు.

అలాగే శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?

చూడాలి మరి ఈ సినిమా నాని కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచి పాన్ ఇండియా హీరోగా నిలబెడుతుందో లేదో.

Advertisement

తాజా వార్తలు