ఫోన్ ను అధికంగా వినియోగిస్తున్నారా.. కళ్ళు మాత్రమే కాదు అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి!

ఇటీవల రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

పాలు తాగే పిల్లాడి దగ్గర నుంచి కాటికి కాలు జాపిన పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ( Smart phone )ను వాడుతున్నారు.

ప్రతి ఒక్కరి జీవితం ఫోన్ తో బాగా ముడి పడిపోయింది.చేతిలో ఫోన్ లేనిదే బయట కాలు కూడా పెట్టడం లేదు.

కొందరికి ఫోన్ అనేది ఒక వ్యాసనంలా కూడా మారిపోయింది.రోజులో సగానికి పైగా టైమ్ ను ఫోన్ చూడడానికే కేటాయించే వారు ఎందరో ఉన్నారు.

రాత్రుళ్లు నిద్ర సమయాన్ని వృధా చేసి మరీ ఫోన్ ను వాడుతుంటారు.అయితే అధికంగా స్మార్ట్ ఫోన్ ను వినియోగించడం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుందని అందరికీ తెలుసు.

Advertisement

అయినా కూడా ఎవ్వరూ ఈ విషయాన్ని పట్టించుకోరు.కానీ కళ్ళు మాత్రమే కాదు ఫోన్ ను అధికంగా వాడటం వల్ల మరెన్నో సమస్యలు తలెత్తుతాయి.

స్మార్ట్ ఫోన్ ను ఓవ‌ర్ గా వాడడం వల్ల మెడ విపరీతంగా నొప్పి పుడుతుంటుంది.మెదడు పనితీరు నెమ్మదిస్తుంది.

ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి క్రమంగా తగ్గుముఖం పడతాయి.చిన్న చిన్న విషయాలను కూడా ఇట్టే మరిచిపోతుంటారు.

అలాగే స్మార్ట్ ఫోన్ ను అధికంగా వాడటం లేదా మాట్లాడటం వల్ల తరచూ తలనొప్పి ( Headache )ఇబ్బంది పెడుతుంది.మైగ్రేన్ బారిన పడే రిస్క్ పెరుగుతుంది.నిద్రలేమికి ఫోన్ ను ఓవ‌ర్ గా వినియోగించడం కూడా ఒక ప్రధాన కారణం.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!

ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ రేస్ వల్ల మీ చర్మ ఆరోగ్యం తీవ్రంగా పాడవుతుంది.చిన్న వయసులోనే ముడతలు ఏర్పడతాయి.త్వరగా యవ్వనాన్ని కోల్పోతారు.

Advertisement

ఫోన్ లో గంటల తరబడి మాట్లాడేటప్పుడు దానిమీద ఉండే వైరస్, బ్యాక్టీరియా మీ చర్మం మీదకి చేరుతుంది.దీనివల్ల మొటిమలు ( Pimples )మచ్చలు తలెత్తుతుంటాయి.

అంతేకాదు స్మార్ట్ ఫోన్ ను అధికంగా వాడటం వల్ల ఏ మాత్రం యాక్టివ్ గా ఉండలేరు.నిత్యం అలసట వేధిస్తూనే ఉంటుంది.బద్ధకం విపరీతంగా పెరుగుతుంది.

ఇక ఫోన్ లోనే మునిగిపోవడం వల్ల మరొక డేంజరస్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఫ్యామిలీతో మీ మంచి అనుబంధం చెడిపోతుంది.ఇటీవల రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఎన్నో కాపురాల్ని కూల్చేస్తుంది.

కాబట్టి వీలైనంత వరకు ఫోన్ వినియోగాన్ని తగ్గించండి.అదే మీ ఆరోగ్యానికి, మీకు మంచిది.

తాజా వార్తలు