వామ్మో.. కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని జ‌బ్బులా..?

పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు దాదాపు అంద‌ర్నీ ఆక‌ర్షించే పానీయాల్లో కూల్ డ్రింక్స్( Cool Drinks ) అనేవి ముందు వ‌రుస‌లో ఉంటాయి.

కూల్ డ్రింక్స్ ను అప్పుడ‌ప్పుడు తాగేవారు కొంద‌రైతే.

రెగ్యుల‌ర్ గా తాగేవారు మ‌రికొంద‌రు.స‌మ్మ‌ర్ సీజ‌న్ వ‌చ్చిందంటే.

ఫ్రిడ్జ్ లో మొద‌ట క‌నిపించేవి కూల్ డ్రింక్ బాటిల్సే.కూల్ డ్రింక్స్ అనేవి రిఫ్రెషింగ్ పానీయాలుగా అనిపించొచ్చు.

కానీ వాటిని తాగ‌డం వ‌ల్ల ఎన్ని జ‌బ్బులు వ‌స్తాయో తెలిస్తే క‌చ్చితంగా ఆశ్చ‌ర్య‌పోతారు.రుచి, వాసన, నాణ్యత, నిల్వ కోసం కూల్ డ్రింక్స్ లో అనేక రకాల రసాయనాలు క‌లుపుతారు.

Advertisement
Dangerous Effects Of Drinking Cool Drinks Details, Cool Drinks, Cool Drinks Side

అటువంటి డ్రింక్స్ ను రోజువారీ అలవాటుగా మార్చుకోవడం చాలా ప్ర‌మాద‌క‌రం.కూల్ డ్రింక్స్ లో ఫాస్ఫారిక్ యాసిడ్ వంటి పదార్థాలు ఉంటాయి.

ఇవి ఎముక‌ల దృఢత్వాన్ని దెబ్బ తీస్తాయి.ఆస్టియోపరోసిస్( Osteoarthritis ) ముప్పును పెంచుతాయి.

అలాగే కూల్ డ్రింక్స్‌లో అధికంగా చక్కెర ఉంటుంది, ఇది బరువు పెరగాడానికి దారితీస్తుంది.అదే స‌మ‌యంలో టైప్-2 డయాబెటీస్( Type-2 Diabetes ) ముప్పును పెంచుతుంది.

Dangerous Effects Of Drinking Cool Drinks Details, Cool Drinks, Cool Drinks Side

అధికంగా కూల్ డ్రింక్స్ ను తాగ‌డం వ‌ల్ల దంత క్షయం ఏర్ప‌డుతుంది.కూల్ డ్రింక్స్ లో కార్బొనేషన్ మరియు ఆమ్ల పదార్థాలు ఉంటాయి.ఇవి గ్యాస్, ఎసిడిటి వంటి స‌మ‌స్య‌ల‌కు కార‌ణం అవుతాయి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

గ్యాస్ట్రోఇసోఫాగియల్ రిఫ్లక్స్ డిసార్డర్ వ‌చ్చే రిస్క్ ను పెంచుతాయి.రెగ్యుల‌ర్ గా కూల్ డ్రింక్స్ ను తాగ‌డం వ‌ల్ల కిడ్నీల ప‌నితీరు దెబ్బ‌తింటుంది.

Advertisement

కిడ్నీ రాళ్ల( Kidney Stones ) సమస్య ఏర్ప‌డ‌వ‌చ్చు.

కూల్ డ్రింక్స్ ప్యాకేజింగ్‌లో ఉపయోగించే ప్లాస్టిక్ బాటిల్స్ బిస్ఫెనాల్-ఎ ఉండొచ్చు.ఇది హార్మోన్ అసమతుల్యతను కార‌ణం అవ్వ‌డ‌మే కాకుండా ప‌లు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.అంతేకాదండోయ్‌.

కూల్ డ్రింక్స్ ను అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల నిద్ర‌లేమి, ఒత్తిడి, డీహైడ్రేషన్, గుండె కొట్టుకునే వేగం పెరగడం, చ‌ర్మంపై మొటిమ‌లు, ఫ్యాటీ లివర్ త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌న్నీ త‌లెత్తుతాయి.కాబ‌ట్టి, కూల్ డ్రింక్స్ ను చాలా లిమిట్ గా తీసుకోవాలి.

కంప్లీట్ గా ఎవాయిడ్ చేస్తే ఆరోగ్యానికి ఇంకా మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు