తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్27, శనివారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.53

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.30

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.11.00 ల11.30

Advertisement

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

ఈరోజు ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేస్తారు.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

పాత మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

ఈటెల ఆ పదవి కన్నేశారా ? అసంతృప్తితో రగిలిపోతున్నారా ?
పవన్ కళ్యాణ్ ఆ సినిమా పై ఫోకస్ చేసిన అకీరా... ఆత్రుతగా ఉందంటూ?

ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వ్యాపారమున ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది.శరీర ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి.

వృధా ఖర్చులు చేస్తారు.విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి.

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి.బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.

ఇతరుల నుండి డబ్బు చేతికి అందుతుంది.

కర్కాటకం:

ఈరోజు నూతన వస్తు, వాహన సౌకర్యం పొందుతారు.సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది.

ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది.

సింహం:

ఈరోజు శారీరక మానసిక అనారోగ్యాలు ఉంటాయి.ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.అనుకొన్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తికాక ఇబ్బందికి గురవుతారు.

వృత్తి ఉద్యోగాలలో అధికారులు కోపానికి గురి కావల్సి వస్తుంది.వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి.

కన్య:

ఈరోజు ఇంటబయట శుభ ఫలితాలను పొందుతారు.సమాజంలో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి.దైవానుగ్రహం తో ముందుకు సాగుతారు.

వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికను చేస్తారు.దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు.

తుల:

ఈరోజు ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది.వృత్తి, ఉద్యోగాలలోఅధికారుల ఆదరాభిమానాలకు పొందుతారు.వ్యాపారపరంగాఆత్మ విశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరచి మంచి ఫలితాలను సాధిస్తారు.

నిరుద్యోగులు లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు.

వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో ఉన్నత కలుగుతుంది.

విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి.

ధనుస్సు:

ఈరోజు చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి.బంధువుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి.ఉద్యోగ విషయమై చెయ్యను పనికి నిందలు పడతారు.

నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు.

మకరం:

ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది.విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.నిరుద్యోగులకు అనుకూల సమయం ఉంటుంది.

కుంభం:

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.సౌకర్యాల కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి.కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.

నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి.వృత్తి ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతను కలిగిస్తాయి.

మీనం:

ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.అన్ని వైపుల మంచి జరుగుతుంది.కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.

అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

వ్యాపారాలు లాభిస్తాయి.

తాజా వార్తలు