తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి14, గురువారం2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.26

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.27

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.11.10 ల11.35

Advertisement
Telugu Rasi Phalalu March 14 Thursday 2024, Daily Astrology, Rasi Phalalu ,Telug

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ.2.48 ల3.36

మేషం:

Telugu Rasi Phalalu March 14 Thursday 2024, Daily Astrology, Rasi Phalalu ,telug

ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి.వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి.

ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

బంధుమిత్రులతో ఊహించని మాటపట్టింపులుంటాయి.

Advertisement

వృషభం:

ఈరోజు బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మిథునం:

ఈరోజు సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది.సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు సేకరిస్తారు.

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కర్కాటకం:

ఈరోజు ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.ఇంటాబయట సమస్యలు పెరుగుతాయి.చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.మానసిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.

మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి.

సింహం:

ఈరోజు దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి.

వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

కన్య:

ఈరోజు ఉద్యోగస్తులకు అదనపు పనిబారం ఉంటుంది.వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు.ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

నిరుద్యోగప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది.

ఇంటాబయట ఊహించని సమస్యలు పెరుగుతాయి.

తుల:

ఈరోజు ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు.వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.

పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికం:

ఈరోజు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి.

వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసిరావు.ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

చిన్ననాటి మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

ధనుస్సు:

ఈరోజు వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి.అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.

నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు.

ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

మకరం:

ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.మానసిక ప్రశాంతత కలుగుతుంది.కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలో ఆచరణలో పెడతారు.

వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి అవుతాయి.

కుంభం:

ఈరోజు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు.

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది.

చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

మీనం:

ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు.

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులకు ఉంటాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ ఉండదు.

వృత్తి వ్యాపారాలలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.

తాజా వార్తలు