దగ్గుబాటి ఫ్యాన్స్ కి నోరు లేదా? ఆ వెబ్ సిరీస్ అడగరేం!

మెగా హీరోల సినిమాల యొక్క అప్‌డేట్స్ రాకుంటే సోషల్ మీడియాలో ఏ స్థాయిలో మెగా ఫ్యాన్స్ హడావుడి చేస్తారో అందరికి తెల్సిందే.

ఆ మధ్య ప్రభాస్ సినిమా యొక్క అప్డేట్‌ ఇవ్వడం లేదు అంటూ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ ను ఏకంగా బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్‌ చేస్తూ చాలా మంది ట్విట్టర్ లో ఒక హ్యాష్ ట్యాగ్‌ ను ట్రెండ్‌ చేసిన విషయం కూడా తెల్సిందే.

ఇతర హీరోల అభిమానులు కూడా తమ యొక్క అభిమాన హీరోల సినిమాల అప్‌డేట్స్‌ రాకుంటే ఊరుకోరు.కానీ దగ్గుబాటి హీరోల అభిమానులు మాత్రం మౌనంగా ఉంటున్నారు.

దగ్గుబాటి అభిమానులకు నోరు లేదా అంటూ కొందరు విమర్శిస్తున్నారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

దగ్గుబాటి హీరోలు వెంకటేష్ మరియు రానాలు ఈ మధ్య కాలంలో సినిమాలు చాలా తక్కువ చేస్తున్నారు.అసలు రానా కొత్త సినిమా ఏంటీ అనేది క్లారిటీ లేదు.

Advertisement
Daggubati Heroes Multi Starrer Rana Naidu Web Series Streaming Update Details, D

వెంకటేష్ ఇటీవలే కొత్త సినిమాను మొదలు పెట్టాడు.ఇక వీరిద్దరు కలిసి రానా నాయుడు అనే వెబ్‌ సిరీస్‌ ను చేశాడు.

నెట్‌ ఫ్లిక్స్ వారు ఈ వెబ్‌ సిరీస్ ను నిర్మించడం జరిగింది.దాదాపు రెండేళ్ల క్రితం ఈ వెబ్‌ సిరీస్‌ ను మొదలు పెట్టారు.

గత ఏడాది లో షూటింగ్‌ ను ముగించినట్లుగా ప్రకటించారు.

Daggubati Heroes Multi Starrer Rana Naidu Web Series Streaming Update Details, D

షూటింగ్‌ ముగించి ఇన్ని నెలలు అయినా కూడా స్ట్రీమింగ్‌ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.స్ట్రీమింగ్‌ చేసే ఉద్దేశ్యం నెట్‌ ఫ్లిక్స్‌ వారికి ఉందా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.ఈ సమయంలో దగ్గుబాటి హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా కాస్త సీరియస్ గా నెట్‌ ఫ్లిక్స్ ను లేదా దగ్గుబాటి హీరోలను రానా నాయుడు గురించి ప్రశ్నిస్తే ఏదో ఒక క్లారిటీ వస్తుంది కదా అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Daggubati Heroes Multi Starrer Rana Naidu Web Series Streaming Update Details, D
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

రానా నాయుడు వెబ్‌ సిరీస్ యొక్క ఔట్‌ పుట్‌ విషయం లో ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి.సరిగా రాని కారణంగానే స్ట్రీమింగ్‌ చేయకుండా ఉంటున్నారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు.రానా నాయుడు ఎప్పటికి స్ట్రీమింగ్‌ అవుతుంది అనేది నెట్‌ ఫ్లిక్స్ వారు అధికారికంగా ప్రకటించాల్సిందే.

Advertisement

ఆ విషయాన్ని దగ్గుబాటి ఫ్యాన్స్ డిమాండ్‌ చేయాల్సి ఉంది.

తాజా వార్తలు