వన్డే వరల్డ్ కప్ లో భారీ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ..!

భారత జట్టు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) ఖాతాలో ఇప్పటికే ఎన్నో భారీ రికార్డులు ఉన్నాయి.

ఏ టోర్నీ ప్రారంభమైన విరాట్ కోహ్లీ ఖాతాలో కొన్ని సరికొత్త రికార్డులు పడుతుంటాయి.

ఎవరు బ్రేక్ చేయలేని మాజీ క్రికెటర్ల రికార్డులను బ్రేక్ చేయడంలో విరాట్ కోహ్లీ తర్వాతే ఎవరైనా.భారత్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్ కప్ లో ఓ భారీ రికార్డు బద్దలు కొట్టేందుకు విరాట్ కోహ్లీ సిద్ధమయ్యాడు.

ఇంతకీ ఆ రికార్డు ఏమిటో చూద్దాం.

Cwc 2023 Virat Kohli World Cup Record,cwc 2023, Virat Kohli ,one Day World Cup,s

భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ ( One Day World Cup )అక్టోబర్ ఐదు న న్యూజిలాండ్- ఇంగ్లాండ్ మ్యాచ్ తో ప్రారంభం ఉంది.ఈ విషయం అందరికీ తెలిసిందే.ఇక అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా( Australia ) తో ఆడనుంది.

Advertisement
CWC 2023 Virat Kohli World Cup Record,CWC 2023, Virat Kohli ,One Day World Cup,S

ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు.ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు.నాలుగు వన్డే వరల్డ్ కప్ టోర్నీలు ఆడిన ఐదో భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు.

ఈ టోర్నీతో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, ధోని లాంటి భారత క్రికెటర్ల దిగ్గజాల సరసన కోహ్లీ చేరనున్నాడు.

Cwc 2023 Virat Kohli World Cup Record,cwc 2023, Virat Kohli ,one Day World Cup,s

విరాట్ కోహ్లీ 2011, 2015, 2019 వన్డే వరల్డ్ కప్ లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.ఈ జాబితాలో అత్యధిక వన్డే వరల్డ్ కప్ టోర్నీలు ఆడిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్( Sachin Tendulkar ) అగ్రస్థానంలో ఉన్నాడు.సచిన్ టెండుల్కర్ తన క్రికెట్ కెరియర్ లో ఆరు వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లలో భాగమయ్యాడు.

పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం జావేద్ మియాందాద్ కూడా ఆరు వన్డే వరల్డ్ కప్ లలో భాగమయ్యాడు.ఇక రికీ పాంటింగ్, మహేల జయవర్ధనే, జాక్వేస్ కలిస్ ఐదుసార్లు వన్డే వరల్డ్ కప్ లో భాగమయ్యారు.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు