మంచిర్యాల సజీవ దహనం కేసులో కీలక మలుపులు

మంచిర్యాల జిల్లా గుడిపల్లిలో జరిగిన సజీవ దహనం కేసు కీలక మలుపులు తిరుగుతుంది.

కేసు విచారణలో భాగంగా మృతుడు శాంతయ్య భార్య, ఇద్దరు కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంతేకాకుండా ఓ ఆటో డ్రైవర్ ను కూడా ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.గుడిపల్లి గ్రామానికి చెందిన వారు ఎవరైనా ఘటనకు సహకరించారా అన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సింగరేణి ఉద్యోగం, ఆస్తి తగాదాల కారణంగానే హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాగా ప్రసుత్తం శాంతయ్య మృతదేహం మంచిర్యాల జిల్లా ఆస్పత్రిలో ఉంది.

శాంతయ్య మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు బంధువులు ముందుకు రాలేదు.దీంతో ఆయన మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రిలోనే భద్రపరిచారు.

Advertisement
ఏఎన్నార్ ఒత్తిడితో మెగాస్టార్ సినిమా వదిలేసిన కోదండరామిరెడ్డి