తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. ద‌ర్శ‌నానికి 48 గంట‌లకు పైగా స‌మ‌యం

తిరుమ‌ల భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతోంది.వ‌రుస సెలవు రోజులు కావ‌డంతో భ‌క్తులు స్వామివారి ద‌ర్శ‌నానికి బారులు తీరారు.

నిన్న‌టి నుంచే భ‌క్తుల ర‌ద్దీ నెల‌కొన‌గా.ఈ ఉద‌యానికి మ‌రింత పెరిగింది.

దీంతో స్వామివారి ద‌ర్శ‌నానికి 48 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని టీటీడీ అధికారులు ప్ర‌కటించారు.స‌ర్వ ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు బారులు తీరారు.

సుమారు 6 కిలోమీట‌ర్ల మేర వేచి ఉన్నారు.దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయ‌ణ‌గిరి షెడ్లు సైతం నిండిపోయాయి.

Advertisement

అటు సేవా సద‌న్ దాటి రింగు రోడ్డు వ‌ర‌కు భ‌క్తులు క్యూ లైన్ల‌లో వేచి ఉన్నారు.

జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!
Advertisement

తాజా వార్తలు