Kaleswara Mukteswara Swami : కార్తీక మాసం లోని చివరి సోమవారం పుణ్యక్షేత్రాలలో భక్తుల రద్దీ.. ఈరోజు భక్తులు ఏమి చేస్తారంటే..

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు కార్తీక మాసం పండుగను ఎంతో ఘనంగా, సంతోషంగా జరుపుకున్నారు.అయితే కార్తీకమాసం చివరి దశకు చేరుకుంది.

ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో శివనామ స్మరణలతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.కార్తిక మాసంలో చివరి సోమవారం కాబట్టి భక్తులు ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి మన దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్లి భక్తితో పూజలు చేస్తూ ఉంటారు.

కృష్ణ, గోదావరి నదులలో పుణ్య స్నానాలు చేసి కార్తిక దీపాలను దేవాలయాలలో వెలిగిస్తూ ఉంటారు.తెలుగు రాష్ట్రాలలోని భక్తులు శివక్షత్రాలతో పాటు ప్రముఖ ఆలయాలలో కూడా తెల్లవారుజామున నుంచే వెళ్లి అభిషేకాలు ప్రత్యేక పూజలను చేస్తూ ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శివ క్షేత్రం అయిన శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.పాతాళ గంగలోకి భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తిక పుణ్య స్నానాలను చేస్తున్నారు.

Advertisement

కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో మల్లన్న దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున నుంచే భక్తులు క్యూ లైన్ లో ఎంతో ఓపికగా నిలబడి ఉన్నారు.

భక్తుల రద్దీ కారణంగా అధికారులు స్వామివారి స్పర్శ దర్శనాలను రద్దు చేశారు.భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు.

పంచారామా క్షేత్రాలైన ద్రాక్షరామం, కుమారరామం, భీమరామం అమరారామం దేవాలయాలలో భక్తుల సందడి ఎక్కువగా ఉంది.త్రిపురాంతకం భైరవకోన, శ్రీకాళహస్తి, కపిల తీర్థం వంటి పుణ్యక్షేత్రాలలో భక్తులు ప్రత్యేకమైన పూజలను శివనామస్మరణలతో చేస్తున్నారు.

అయితే తెలంగాణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.యాదగిరిగుట్టకు భక్తులు ఎక్కువగా తరలివస్తున్నారు.కాలేశ్వర ముక్తేశ్వర స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి తదితర ఆలయాల్లో కార్తీకమాసం చివరి సోమవారం కాబట్టి భక్తులు ఎక్కువగా తరలివస్తున్నారని దేవస్థానం అర్చకులు చెబుతున్నారు.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
ఉల్లి, ఉసిరి క‌లిపి ఇలా తీసుకుంటే..ర‌క్త‌హీన‌త ప‌రార్‌!

ఈరోజు తెల్లవారుజామున నుంచే భక్తులు నది స్నానం చేసి ఎంతో భక్తితో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలను, అభిషేకాలను చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు