మరోసారి ఎదురుకాల్పులు…ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు Top Galleries

జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం ఉదయం భద్రతా బలగాలకు,ఉగ్రవాదులకు మధ్య ఈ ఎదురుకాల్పులు ఘటన చోటుచేసుకుంది. జమ్మూకాశ్మీర్ లోని పోషియాన్ జిల్లా జైనా పొర ప్రాంతంలోని ద్రగడ్ గ్రామ సమీపంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం తో భద్రతా బలగాల తో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ముందుగా జవాన్ల పై కాల్పులకు దిగడం తో బలగాలు ఉగ్రవాదుల కాల్పులకు ధీటుగానే ఎదురుకాల్పులు జరపడం తో వారి చర్యలను తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

 Cross Fire In Jammu And Two Terrorists Dead-TeluguStop.com

శుక్రవారం వేకువ జామున ఉగ్రవాదులు బలగాల పై కాల్పులకు తెగబడ్డారని, ఈ క్రమంలో బలగాలు ఎదురుకాల్పులు జరపడం తో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంకా ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది ఆపరేషన్ కొనసాగుతుంది. మరోపక్క ఈ ఘటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మొబైల్,ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసినట్లుట్ తెలుస్తుంది. పుల్వామా ఉగ్ర దాడి అనంతరం జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో తరచూ ఎదురుకాల్పులు సాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter