వైసీపీని వీడటంపై క్రికెటర్ అంబటి రాయుడు వివరణ..!!

క్రికెటర్ అంబటి రాయుడు( Cricketer Ambati Rayudu ) వైసీపీకి రాజీనామా చేయడంపై వివరణ ఇచ్చారు.

దుబాయ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ లీగ్ -ILT20 లో ( International League -ILT20 ) పాల్గొనేందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ లీగ్ లో ముంబై ఇండియన్స్( Mumbai Indians ) తరపున ఆడుతున్నట్లు అంబటి రాయుడు వెల్లడించారు.ఈ మేరకు ఈనెల 20వ తేదీ నుంచి టీ 20 లీగ్ లో ఆడుతున్నానని తెలిపారు.

ప్రొఫెషనల్ గేమ్ ఆడేందుకు గానూ రాజకీయాలతో ఎటువంటి సంబంధం ఉండకూడదన్న ఆయన ఈ కారణంగానే వైసీపీని( YCP ) వీడినట్లు స్పష్టం చేశారు.అయితే గత నెలలో సీఎం జగన్( CM Jagan ) సమక్షంలో వైసీపీలో చేరిన ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.కాగా అంబటి రాయుడు రాజీనామాపై పలు విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు