హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్( Hyderabad ) లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ అయింది.

ఈ మేరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బెట్టింగులకు పాల్పడుతున్న నిందితుల ముఠాను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆన్ లైన్ బెట్టింగు( Online betting )లు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించి నలుగురిని పట్టుకున్నారు.అనంతరం నిందితుల నుంచి సుమారు రూ.37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.ఢిల్లీ కేంద్రంగా ఈ ముఠా బెట్టింగులను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అలాగే ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement