మెగాస్టార్‌తో చిందులేయనున్న కన్నడ బ్యూటీ

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సైరా నరసింహారెడ్డి సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే.

కాగా సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో చిరు తన 152వ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమాను ఇటీవల చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగా, ఈ సినిమాలోని పాత్ర కోసం చిరు తనను తాను మేకోవర్ చేసుకుంటున్నారు.అయితే చిరు 152వ చిత్రంలో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేసిన చిత్ర యూనిట్, ఈ సినిమాలోని ఓ స్పెషల్ పాటలో చిరుతో డ్యాన్స్ చేయడానికి క్రేజీ హీరోయిన్‌ను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది.

ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన, ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోయిన్‌గా మారింది.మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, బన్నీ-సుకుమార్ సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటీని చిరు సరసన డ్యాన్స్ చేయించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

మణిశర్మ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ను అతిత్వరలో ప్రారంభించనున్నారు.కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ సినిమాకు గోవింద ఆచార్య, గోవింద హరి గోవింద అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు