బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కు సీపీఎం మద్ధతు.. సీఎం రేవంత్

సీపీఎం నాయకులతో కీలక చర్చలు జరిపినట్లు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు సంపూర్ణ మద్ధతు ఇవ్వాలని వారిని కోరామని తెలిపారు.

మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా సీపీఎం( CPM ) ముందు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.బీజేపీని( BJP ) ఓడించేందుకు కాంగ్రెస్ కు మద్ధతు ఇస్తామని సీపీఎం నేతలు చెప్పారన్నారు.

దేశంలోనూ ఇండియా కూటమితో( India Alliance ) కలిసి పని చేయనున్నారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.దీనిపై పార్టీ హైకమాండ్ తో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తామని తెలిపారు.

సీపీఎం సహకారంతో భవిష్యత్ లో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు