క‌రోనా నుంచి కోలుకున్న‌వారికి ఆ ముప్పు త‌ప్ప‌దా.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!!

గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగుచూసిన ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్‌.ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఈ క‌రోనా భూతం దెబ్బ‌కు ప్ర‌తిరోజు వేల మంది బ‌లైపోతున్నారు.ఇక ఈ మ‌హ‌మ్మారిని ఎలాగైనా క‌ట్ట‌డి చేయాల‌ని చూస్తున్న ప్ర‌పంచ‌దేశాల ప్ర‌భుత్వాల‌కు.

క‌రోనా చుక్క‌లు చూపిస్తోంది.ప్ర‌పంచ‌దేశాల‌కు కంటికి క‌నిపించ‌ని శత్రువుగా మారిన క‌రోనాకు వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో.

పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.మొద‌ట క‌రోనాను లైట్ తీసుకున్న ప్ర‌జ‌లు.

Advertisement
Corona Victims Face Hearing Problems!! Corona Victims, Hearing Problems, Latest

ఇప్పుడు దాని పేరు వింటేనే గ‌డ‌గ‌డ‌లాడిపోతున్నారు.ఇదిలా ఉంటే.

రోజురోజుకు క‌రోనా గురించి కొన్ని షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నారు.

Corona Victims Face Hearing Problems Corona Victims, Hearing Problems, Latest

కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారిలో కొత్తగా ఇప్పుడు వినికిడి లోపం కనిపిస్తుందని కరోనా సోకి పోరాడి బయటపడిన వారు చాలామంది వినికిడి కోల్పోయినట్టు తాజా స‌ర్కేలో తేలింది.మాంచెస్టర్ యూనివర్శిటీ నిపుణులు క‌రోనా నుంచి కోలుకున్న‌వారిపై ఓ స‌ర్వే నిర్వ‌హించారు.క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన ఎనిమిది వారాల తర్వాత.

వారికి ఫోన్ ద్వారా పలు అంశాలపై ఆరా తీశారు.ఈ క్ర‌మంలోనే మీలో ఎవరికైనా వినికిడిలో ఏమైనా మార్పులు ఎదురయ్యాయా అని అడిగినప్పుడు.అందులో దాదాపు 13.2 శాతం మంది వినికిడి కోల్పోయామని తెలిపారు.అయితే క‌రోనా కారణంగా చెవి లేదా కోక్లియాతో సహా వినికిడి వ్యవస్థ భాగాల్లో సమస్యలను కలిగించే అవకాశం ఉంద‌ని నిపుణులు అంటున్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఏదేమైనా క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాం అనుకుంటున్న సమయంలో వారిలో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు