హర్యానా స్పీకర్ కు కరోనా పాజిటివ్.. మరో ఇద్దరి ఎమ్మెల్యేలకు !

దేశవ్యాప్తం కరోనా కేసులు శరవేగంగా వ్యాప్తి చెందుతూనే ఉంది.రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

ఈ మేరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 లక్షలకు పైగా దాటింది.రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులను చూసి ప్రజలు భయాందోళ చెందుతున్నారు.

అయితే కరోనా భయం సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులను వీడటం లేదు.రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

ఇప్పటికే పలు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి చికిత్స పొందుతుండగా.మరికొందరు క్యూర్ అయి విధుల్లోకి చేరారు.

Advertisement

తాజాగా హర్యానా అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తాతో పాటు మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.గత కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధ పడుతున్న స్పీకర్ జియాన్ చంద్ గుప్తా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకున్నారు.

రిపోర్టుల్లో పాజిటివ్ రావడంతో వైద్యం కోసం ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.అలాగే ఎమ్మెల్యేలు అసీం గోయెల్, రామ్ కుమార్ కరోనా బారిన పడ్డారు.

ఈ మేరకు వీళ్లు కూడా హోం క్వారంటైన్ ఉంటూ చికిత్స పొందుతున్నారు.అయితే ఇంకో రెండు రోజుల్లో వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

స్పీకర్ స్థానంలో డిప్యూటీ స్పీకర్ రణ్ వీర్ గాంగ్వా అధ్యక్షత వహించనున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు