దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.కేసుల సంఖ్య తగ్గుతూ మళ్లీ పెరుగుతోంది.
గత నాలుగు రోజులుగా తగ్గిన కేసులు శుక్రవారం మళ్లీ పెరిగాయి.
దీంతో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
వైరస్ తీవ్రత నానాటికి పెరగడంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.కానీ రాష్ట్రాల వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
ఇప్పటికే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.నిన్నటి రోజు 86 వేలకు పరిమితమైన కేసులు ఈ రోజు 88 వేలకు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తాజాగా భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్మార్) కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో దేశంలో 88,600 కరోనా కొత్త కేసుల నమోదయ్యాయి.
దీంతో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 59,92,533కి చేరిందని, తర్వలో 60 లక్షలకు చేరి రికార్డు సృష్టించనుంది.నిన్న ఒక్కరోజే 1,124 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా.
మరణాల సంఖ్య 94,503కి పెరిగింది.ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 49,41,628 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 9,56,402 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తం 9,87,861 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
దీంతో ఇప్పటివరకూ 7,12,57,836 మంది నిర్ధారణ పరీక్షలు చేశారు.కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు.
శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని భారతీయ వైద్య పరిశోధన మండలి సూచించింది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy