తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కారు పాడైపోయి షెడ్ కు పోయిందన్న రేవంత్ రెడ్డి ఇకపై దాన్ని తుక్కుకు వేయాల్సిందేనని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని కేసీఆర్( KCR ) అంటున్నారని, 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే దమ్ముంటే కాంగ్రెస్ ను టచ్ చేసి చూడాలన్నారు.కాంగ్రెస్ హైటెన్షన్ వైరు లాంటిదని, ముట్టుకుంటే మాడి మసై పోతారని రేవంత్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ ఎలా ఖాళీ అవుతుందో తాను చూస్తానని చెప్పారు.మీలాంటోళ్లను తొక్కుకుంటూ ఈ స్థాయికి వచ్చానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.కేసీఆర్, మోదీ చీకట్లో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.
కేసీఆర్, మోదీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారా అని ప్రశ్నించారు.ప్రజాపాలన అంతం కావాలని కుట్రలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy