మేం లేకపోతే కాంగ్రెస్ గెలిచేది కాదు..నారాయణ షాకింగ్ కామెంట్స్..!!

ఒకప్పుడు దేశంలో కమ్యూనిజం అనేది ఎక్కువగా ఉండేది.కమ్యూనిస్టు పార్టీలు ప్రజలకు చాలా సహాయం చేసేవి.

కానీ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల లాగే కమ్యూనిస్టు పార్టీలు కూడా తయారయ్యాయి అని చెప్పడంలో ఎలాంటి శక్తి లేదు.అయితే తాజాగా తెలంగాణ ( Telangana ) లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం సిపిఐ తో పొత్తు పెట్టుకోవడమేనని, సిపిఐ వల్లే కాంగ్రెస్ కి అదృష్టం పట్టింది అన్నట్లుగా సిపిఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ అనడం ప్రస్తుతం అందరికీ షాకింగ్ అనిపిస్తుంది.ఎందుకంటే అసలు ఖమ్మంలోని కొత్తగూడెంలో తప్ప మిగిలిన ఎక్కడా కూడా సిపిఐ కి అంతగా గుర్తింపు లేదు.

అయితే ఖమ్మం, నల్గొండ వంటి నియోజకవర్గాల్లో కమ్యూనిజం ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం వారిని గెలిపించేలా లేరు.ఇక ఈసారి సిపిఐ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటు ఆశించింది.ఇక కొత్తగూడెం సీటు లో కూనంవేని సాంబశివరావు ( Kunamveni Sambashiva rao ) గెలుపొందారు.

Advertisement

ఇక అక్కడ సాంబశివరావు గెలుపొందడానికి కూడా కాంగ్రెస్ వాళ్ళ హస్తముందని, వారి వల్లే సాంబశివరావు గెలిచారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే కనీసం అభ్యర్థులు కూడా సరిగ్గా లేని సిపిఐ పార్టీకి సంబంధించిన నారాయణ ( Narayana ) తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మా పార్టీనే కారణమని,సిపిఐతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని మాట్లాడం హాస్యాస్పదంగా ఉందని పలువురు మాట్లాడుకుంటున్నారు.అంతేకాదు ఈ విషయం తెలిసిన కొంతమంది ప్రజలు,రాజకీయ విశ్లేషకులు అయితే కాంగ్రెస్ మీ వల్లే గెలిస్తే మీరెందుకు ఒంటరిగా పోటీ చేయలేదు.కాంగ్రెస్ తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు.

అంతమంది ప్రజలు మీ వెంట ఉంటే ఒంటరిగా పోటీ చేస్తే తెలిసేది కదా అని అంటున్నారు.అంతేకాదు ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన సిపిఎం ( CPM ) పరిస్థితి ఎలా ఉందో చూశారు కదా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు.

అలాంటి మీకు తెలంగాణలో ఒక సీటు గెలవగానే మా వల్లే కాంగ్రెస్ వచ్చిందని గొప్పలు చెప్పుకోవడం ఏ మాత్రం బాగాలేదని మాట్లాడుకుంటున్నారు.ఇక వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న నారాయణ మిగిలిన మూడు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకపోవడం వల్లే ఓడిపోయిందని మాట్లాడి వివాదానికి దారి తీసారు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

ఇక నారాయణ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది గత ఎన్నికల్లో కూడా సిపిఐ తో టిడిపి,కాంగ్రెస్ ( Congress ) పొత్తు పెట్టుకుంది కదా మరి అప్పుడు ఎందుకు బీఆర్ఎస్ గెలిచింది అని ప్రశ్నిస్తున్నారు.ఏది ఏమైనప్పటికి కాంగ్రెస్ దయ తలచి ఒక్క సీటు ఇస్తే అది గెలిచి గొప్పలకు పోతున్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ.

Advertisement

తాజా వార్తలు