కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం.. టీపీసీసీ చీఫ్

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.కర్ణాటకలో కాంగ్రెస్ వస్తే తెలంగాణలోనూ తమదే అధికారమని తెలిపారు.

బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ పని చేశారని ఆరోపించారు.బీజేపీ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ ప్లాన్లు ఉన్నాయన్నారు.

కుమారస్వామి సింగపూర్ లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఉండి చక్రం తిప్పుతున్నారని విమర్శించారు.కర్ణాటకలో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కర్ణాటక ఎన్నికల్లో స్పష్టమైందని తెలిపారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021

తాజా వార్తలు