ఆ ఎమ్మెల్యే ల పై కొత్త యుద్ధం మొదలెట్టిన కాంగ్రెస్ !?

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది.అంతర్గతంగా ఆ పార్టీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్న,  ఎప్పటికప్పుడు తమ ప్రధాన ప్రత్యర్థి టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.

2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ ను అధికారనికి దూరం చేయడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది.అంతర్గతంగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు దాదాపు ఒక కొలిక్కి వచ్చాయి.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్ రావు టాక్రే త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు  కాంగ్రెస్ కొత్త పోరు మొదలుపెట్టింది.

దీనిపై ఎంతవరకు పోరాడుతుందో చూడాలి.కాంగ్రెస్ టికెట్ పై గెలిచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలను ఇప్పుడు టార్గెట్ చేసుకుంది.

Advertisement

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో , ముగ్గురు కాంగ్రెస్ టికెట్ పై గెలిచి టిఆర్ఎస్ లో చేరిన వారే కావడంతో ఆ విషయాన్ని హైలెట్ చేస్తూ కాంగ్రెస్ పోరుబాట మొదలుపెట్టింది.ఈ కేసులో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలకు అమ్ముడుపోవడం అలవాటుగా మారింది అంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.12 మంది ఎమ్మెల్యేల పైన సిబిఐ దర్యాప్తు చేయించాలని కొత్త డిమాండ్ ను తెర పైకి తెచ్చింది.ఈ మేరకు పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి వివిధ రూపాల్లో లబ్ధి పొందారని , వాళ్లకు కలిగిన రాజకీయ ఆర్థిక లాభాలను కూడా వివరించింది.వీటన్నిటి పైన నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.ఈ 12 మంది ఎమ్మెల్యేల పైన దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడంతో పాటు , ఈ 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంటుంది.

 .

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు