రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతాన్ని కాంగ్రెస్ సెంటిమెంట్ గా భావిస్తోంది.ఈ మేరకు లోక్ సభ ఎన్నికలకు ఇక్కడి నుంచే శంఖారావాన్ని పూరించాలని నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా తుక్కుగూడలో ‘జనజాతర’( Janajatara ) పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.ఈ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది.
దాదాపు 14 ఎంపీ సీట్లను గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల జాతీయ మ్యానిఫెస్టోను( National Election Manifesto ) ఈ సభా వేదికపై నుంచి ప్రకటించనుంది.అలాగే తుక్కుగూడ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో( Rahul Gandhi , AICC President Mallikarjuna Kharge ) పాటు పలువురు పార్టీ కీలక నేతలు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో సుమారు పది లక్షల మంది జనసమీకరణ చేయాలని కాంగ్రెస్ సమాయత్తం అవుతుంది.మరోవైపు జన జాతర సభపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా సభా ఏర్పాట్లతో పాటు జనసమీకరణ తదితర అంశాలపై చర్చించనున్నారు.కాగా ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఎంపీ అభ్యర్థులు, ఇంఛార్జులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy