కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) కోలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్( Vijay ) దళపతి తో తన నెక్స్ట్ సినిమాను చేస్తున్నాడు.
లోకేష్ కనకరాజ్ ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు స్టార్ డైరెక్టర్ గా నిలవడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించు కున్నాడు.
బాగా డిమాండ్ ఉన్న డైరెక్టర్ లలో ఒకరిగా లోకేష్ ఉన్నారు.ఖైదీ, విక్రమ్ లతో సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ కు గేట్లు తెరిచిన లోకేష్ ఆ తర్వాత పాన్ ఇండియన్ సినిమా దగ్గర మంచి నేమ్ అండ్ క్రేజ్ ను పెంచుకున్నాడు.
ఇలా ఇప్పుడు ఈయన చేస్తున్న లియో సినిమాకు ఏ రేంజ్ లో క్రేజ్ పెరిగిందో ఎవ్వరి ఊహలకు అందడం లేదు.ఎన్ని చోట్ల ప్రీ సేల్స్ తో ఈ మూవీ అదరగొడుతుంది అనే చెప్పాలి.
ఈ సినిమా కోసం ఈ రేంజ్ లో ప్రేక్షకులు ఎదురు చూస్తారని ఎవ్వరూ అనుకోలేదు.ఈ సినిమాకు ఇంత క్రేజ్ పెరగడానికి కారణం విక్రమ్ అనే చెప్పాలి.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇది భాగం అని సినిమా స్టార్టింగ్ లో ప్రకటన చేసినప్పటికీ ఆ తర్వాత మేకర్స్ ఈ విషయంలో గోప్యంగా ఉన్నారు.
కానీ ఈ సస్పెన్స్ ను తాజాగా ఒక స్టార్ హీరో రివీల్ చేసాడు.
ఈ సినిమా చుసిన ఉదయనిధి స్టాలిన్( Udayanidhi Stalin ) లియో టీమ్ కు కంగ్రాట్స్ చెబుతూ ఎల్ సి యు అని మెన్షన్ కూడా చేయడంతో ఈ సినిమా ఎల్ సి యు కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పాలి.ఇది సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అని ఫ్యాన్స్ ఫిక్స్ అవ్వడంతో ఇప్పుడు మరింత క్రేజ్ పెరిగింది.అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.
చూడాలి మరి ఈ మూవీ రిలీజ్ తర్వాత ఏ రేంజ్ లో అంచనాలు అందుకుంటుందో.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy