ఆదాని-అంబుజా సిమెంటు పరిశ్రమకు వ్యతిరేకంగా నేడు సదస్సు

రామన్నపేట పరిధిలో రైతులను మోసం చేసి ఏర్పాటు చేస్తున్న ఆదాని- అంబుజా సిమెంట్(Adani-Ambuja cement) పరిశ్రమను వ్యతిరేకిస్తూ పర్యావరణ పరిరక్షణ వేదిక,అఖిలపక్షాల ఆధ్వర్యంలో నేడు రామన్నపేటలో జరగబోయే సదస్సుకు అన్ని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవతం చేయాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు.

రామన్నపేట రహదారి బంగ్లాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ 15వ,తేదీన రామన్నపేట మండల (Ramannapet mandal)కేంద్రంలో జరిగే సదస్సుకు అన్ని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, పరిశ్రమ నుండి వచ్చే కాలుష్య ముప్పును అవగాహన చేసుకుని ఐక్యంగా ఉద్యమించాలని తెలిపారు.

ఈకార్యక్రమంలో సిపిఎం(CPM) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి మల్లారెడ్డి, పోచబోయిన మల్లేశం, ఊట్కూరి నర్సింహ,జల్లెల పెంటయ్య,గంగుల రాజిరెడ్డి,యండి రెహాన్, ఫజల్ బేగ్,బొడ్డుపల్లి వెంకటేశం,నాజర్, జమీరొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable

Latest Yadadri Bhuvanagiri News